Click here for part 1 # Part 1
school లో ఖాళీ సమయంలో రేవంత్ తన మావయ్య చెప్పిన మాటల గురించి ఆలోచించాడు . అంత చెప్పిన మావయ్య ఎప్పుడు చూసినా ఇంటిదగ్గర ఖాళీగా కూర్చుని ఉంటాడు , ఇంకేం success అవుతాడు ! అయినా fail అయిన వాళ్లే success గురించి మాట్లాడతారు కదా అని లైట్ తీసుకున్నాడు .
రేవంత్ కి తన social teacher ఏ inspiration . ఆ మేడం చాలా మంచివారు , పాఠం కళ్ళకు కట్టినట్టు మంచి examples తో చెప్తారు . రేవంత్ కి ఆవిడలా successful teacher అవ్వాలని ఉండేది ఎప్పటినుంచో . ఇక రేవంత్ మేడం గారిని follow అవుదాం అనుకున్నాడు . అలా school కి వెళ్లడం , home work చేయడం , exams రాయడంతో 9th క్లాస్ అయిపోయింది .
ఇప్పుడు రేవంత్ 10th class . 10th class మొదటి రోజున class కి head master గారు వచ్చి , అందరూ10th class అయ్యాక ఏం చేస్తారు అని అడిగారు ? " aeronautical engineering నుంచి politician దాకా అన్నీ చెప్పేశారు . రేవంత్ మాత్రం మన సోషల్ మేడంలా మంచి teacher ని అవుతాను అని అన్నాడు . జాగ్రత్తగా చదవండి అని చెప్పి head master గారు వెళ్లిపోయారు . ఆ రోజు స్కూల్ మొత్తం తిరిగినా సరే , రేవంత్ కి సోషల్ మేడం ఎక్కడా కనబడలేదు . వేరే సార్ ని మేడం గురించి అడిగితే " మేడమ్ గారికి digital assistant జాబ్ వచ్చింది , ఇక ఆవిడ ఈ school కి రారు అన్నారు " ఆ సార్ . ఆ మాట వినగానే రేవంత్ అక్కడినుండి నడుచుకుంటూ వచ్చేసాడు
రేవంత్ కి అర్థం కాలేదు ! మేడం గారి goal టీచర్ కానప్పుడు టీచర్ ఎందుకు అయ్యారు ? ముందే ఈ జాబ్ కోసం try చేయొచ్చు కదా ! అంటే మేడం గారి కన్నా మా మావయ్యే గొప్పా ? అన్న సందేహాలు వచ్చాయి . ఈ సందేహాలన్నీ ఒక paper మీద రాసుకుని , ఆ రోజు సాయంత్రం మేడం గారి ఇంటికి వెళ్ళాడు . మేడం గారు కూర్చోబెట్టి sweet ఇచ్చారు . ఇక రేవంత్ ఓకే మాటలో అడిగేసాడు " మేడం ! మీరు ఇంక school కి రారా ? "అని . మేడం తనకి జాబ్ వచ్చిన విషయం చెప్పి , జాగ్రతగా చదువుకోమని కూడా చెప్పారు .
ఇక రేవంత్ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు
" అదేంటి మేడం ! నేను మీలాగా మంచి టీచర్ అవుదామనుకుంటే , మీరేమో ఇలా చేశారు . మా మావయ్య success గురించి చెబుతుంటే సోది అనుకున్నాను , ఆ success కి మీరే example అనుకున్నాను .
అంటే మా మావయ్యే కరెక్టా ? అని తన మామయ్య చెప్పిన మాటలు రాసిన book ఇచ్చాడు . ఆ book చదివిన మేడం చిన్నగా నవ్వి , రేవంత్ కి ఇలా సమాధానం ఇచ్చింది ....
చూడు రేవంత్ ! ఎవరైనా గోల పెడుతూ పుడతారు గానీ , గోల్ పెట్టుకుని పుట్టరు !
పుట్టుకలో అందరూ ఒకటే . లోకం తెలుసుకున్న తరువాత , నీకోసం నువ్వు మళ్ళీ పుట్టాలి , ' ఏం చేయాలో ' ఆలోచించాలి . అవసరం కోసం కాకుండా ఆశయం కోసం కష్టపడాలి .
కానీ మన ఆలోచనలన్నీ ' ఏం చదవాలో ' అన్న దగ్గరే ఆగిపోతాయి , ' ఎందుకు చదవాలో ' అని ఆలోచించేంత వరుకూ వెళ్ళవు .
అందువల్లే ఎండాకాలంలో పెరిగే డిగ్రీలకు చదువుకున్నవాళ్ళూ , చదువుకోనివాళ్ళూ ఇద్దరూ తట్టుకోలేకపోతున్నారు .
నీకో విషయం తెలుసా ! కళ్ళు మూసుకుని తిరిగినా కళ్ళు తిరుగుతాయి , అంటే గుడ్డిగా ప్రయత్నించినా ఏదో ఒక ఫలితం ఉంటుంది
అందువల్లనే ఏమో , చాలా మంది ఏదో ఒక job చేస్తూ గౌరవంగా బ్రతుకుతున్నారు .
చదువు పూర్తి చేసుకుని ఇంటిదగ్గరే వుండటం అంటే మామూలు విషయం కాదు .
నీకు తెలుసా ! ఖాళీగా ఉంటే ఎవరు ఎవరిని పిలిచినా మనల్నే పిలిచినట్లు ఉంటుంది .
' ఏం చేస్తున్నావ్ ' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేనప్పుడే అనిపిస్తుంది ' మనం ఇంకేం చేయలేమేమో ' అని .
ఎదురైన ప్రతి ఒక్కరూ ' ఏం చేస్తున్నావ్ ' అంటే ఇంకేం చేస్తాం !
వాళ్లు answer fix అయిపోయి మనల్ని question అడుగుతారు . వాళ్ళు అనుకున్న answer చెప్పకపోతే ' మనల్ని మొత్తానికీ తీసి పారేస్తారు ' .
అంతెందుకు మనకి వచ్చే జీతంతో మన జీవితాన్ని decide చేసేస్తారు .
అందుకే చాలా మంది ' ఏదో ఒక దాని కోసం ' try చేస్తున్నారు , అందుకైనా కొంతమంది' ఏదో ఒక్క దాని కోసమే ' కష్టపడుతున్నారు .
పరిస్థితులతో పోల్చుకునే వాళ్ళు కొంతమంది అయితే , పరిస్థితులతో తేల్చుకునేవాళ్ళు మరికొంతమంది .
Click here for story behind the
above quote # కూతురి డైరీలో నాన్న కల
మీ మావయ్య ఇంటి దగ్గరే ఉన్నాడని తక్కువగా చూడకు , ఎందుకంటే కూర్చుని ఉన్న వాళ్ళందరూ ఖాళీగా ఉన్నట్టు కాదు !
సరేనా ! 10th class బాగా చదువు , తర్వాత ఏం చదవాలో ఆలోచించుకో . ఎందుకంటే , decision అనేది కంట్లో పడ్డ నలక లాంటిది , దానిని సరిగ్గా తీసుకుంటేనే ఇబ్బంది ఉండదు " అని అన్నారు .
ఈ మాటలు విన్న రేవంత్ ఇంటి బయటకు వచ్చి , సైకిల్ తాళం తీసి , మెల్లగా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి బయల్దేరాడు......
( to be continued ...... )
- giribabu MR.
చదువు పూర్తి చేసుకుని ఇంటిదగ్గరే వుండటం అంటే......
Reviewed by Giribabu dola
on
April 01, 2020
Rating:
Need some more like this
ReplyDelete