Photo credit- financial express.com
రాము మరియు లక్ష్మి ఇద్దరూ భార్యాభర్తలు. వీరిద్దరూ కృష్ణవలస అనే గ్రామంలో, పెంకుటింట్లో చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. రాము పొలం పనికి వెళ్తుంటాడు. పని ఉన్న రోజు వెళ్తాడు, పనిలేని రోజు ఇంటి దగ్గరే ఉంటాడు.
ఒకరోజు రాము పనిలేదని ఇంటి దగ్గరే ఉన్నాడు. రాము ఇంటి వెనకాల ఒక పెరటు ఉంది. ఆ పెరట్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. రాము ఇంటి దగ్గరే ఉండడంతో తన భార్య లక్ష్మి చెప్పినట్టు, ఆ పెరట్లో ఉన్న పిచ్చిమొక్కలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ పిచ్చిమొక్కలను తొలికి తో పీకి పారేస్తుండగా, మధ్యలో ఒక సీతాఫలం ఒక్క కనిపించింది. లక్ష్మీ వేసిన గింజల వల్లే ఆ మొక్క మొలిచింది. రాము ఆ మొక్కను అలానే ఉంచి, మిగిలిన పిచ్చిమొక్కలని పీకేసి ఆ పెరటిని శుభ్రం చేశాడు.
పనికి వెళ్లడం కోసం రాము ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాడు. యధావిధిగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి, పళ్ళు తోముకునే సమయంలో ఆ సీతాఫలం మొక్కకు నీళ్ళు పోసాడు. అలా రాముకి ఆ మొక్కకు నీళ్లు పోయడం అలవాటుగా మారింది. ఆ అలవాటు కాస్తా ప్రేమగా మారింది. అలా ఆ మొక్క చుట్టూరా నీళ్లు నిలవడానికి గొయ్యి తవ్వాడు. నెల రోజులకొకసారి ఆ పెరట్లో పెరిగే పిచ్చిమొక్కలను కొట్టేవాడు. ఆ సీతాఫలం మొక్క బాగా ఎదగడానికి బియ్యం కడిగిన నీళ్లు, కూరగాయల తొక్కలు వేసేవాడు.
రాత్రి అన్నం తినేసిన తర్వాత ఆ మొక్క దగ్గరికి వచ్చి ప్రశాంతంగా చుట్ట కాల్చుకునే వాడు.
ఆ సీతాఫలం మొక్కకు కూడా రాము అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా రాము కోసం ఒక మంచి సీతాఫలం పండు కాయాలని దాని కోరిక. కానీ ఎప్పుడూ ఆ విషయం రాముతో చెప్పలేదు.
అలా రెండు సంవత్సరాలు గడిచాయి. సీతాఫలం మొక్క ఎదిగి చిన్న చెట్టుగా మారింది.
అది వేసవి కాలం. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటిలాగే రాము చద్ది అన్నం పట్టుకుని పనికి వెళ్ళాడు. ఉదయం 11గంటలకు అందరూ అన్నం తినడానికి పొలంగట్టు మీద ఉన్న వేప చెట్టు కిందకి వచ్చారు. అందరూ క్యారేజీలు విప్పి అన్నం తింటున్నారు. రాముతో పాటూ పనికి వచ్చిన శంకరం తన అన్నంలో నంచుకుంటానికి రెండు మామిడి పళ్ళు తెచ్చుకున్నాడు.
రాము "ఆ మామిడిపళ్ళు ఎంతకి కొన్నావు" అని శంకరాన్ని అడిగాడు. అప్పుడు శంకరం "నేను ఈ మామిడి పళ్ళను కొనలేదు. అయినా ఇప్పట్లో ఈ మామిడిపండ్ల ధరలకు వాటిని కొనగలమా! అది కూడా మందులు కొట్టి మామిడి పండ్లను పండిస్తున్నారు. వాటిని కొనడం కన్నా, మన పెరట్లో పండించుకోవడం మంచిది. ఈ మామిడిపళ్ళు మా పెరట్లో ఉన్న చెట్టుకు కాసాయి. ఎలా ఉందో రుచి చూడు" అని ఒక మామిడి పండు తినడానికి ఇచ్చాడు.
రాము ఆ మామిడి పండుని తిని చూసాడు. నిజంగానే ఆ పండు చాలా రుచిగా ఉంది. మళ్లీ చెప్తున్నా! ఆ మామిడిపండు నిజంగానే చాలా రుచిగా ఉంది. అన్నం తినడం పూర్తయిన తర్వాత మళ్ళీ పని మొదలుపెట్టారు.
సాయంత్రం అయింది. రాము పని నుండి ఇంటికి వచ్చాడు. క్యారేజీని గుమ్మంలో పెట్టి, పెరట్లోకి వెళ్ళాడు. చల్లగా గాలి వేస్తూ, ఆ గాలికి సీతాఫలం చెట్టు కొమ్మలు ఊగుతూ, పెరటు మొత్తం ప్రశాంతంగా ఉంది.
రాము సీతాఫలం చెట్టు దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడాడు " ఇంతకుముందులా నువ్వు మొక్కవి కాదు. ఇప్పుడు నువ్వు కూడా కాయలు కాసే సమయం వచ్చింది. ఈ రోజే శంకరం వాళ్ళ పెరట్లో కాసిన మామిడిపండు తిన్నాను. ఆ మామిడిపండు చాలా రుచిగా ఉంది. నాకు అలాంటి మామిడిపళ్ళు ఇంకా తినాలని ఉంది. కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుండి మామిడిపళ్ళు కాయాలి, సరేనా! " అని అన్నాడు
ఆ మాటలు విన్న సీతాఫలం చెట్టు ఆశ్చర్యపోయింది. "నేను సీతాఫలం చెట్టుని. నేను ఎలా మామిడి పళ్ళు కాయగలను? అది నావల్ల కాదు! " అని చెప్పింది.
" అదంతా నాకు తెలియదు. నువ్వు మామిడిపళ్ళు కాయాల్సిందే " అని ఖరాఖండిగా చెప్పేసి, రాము అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
ఆరోజు రాత్రి అన్నం తినేసిన తర్వాత చుట్ట కాల్చడానికి రాము పెరట్లోకి వచ్చాడు. అప్పుడు కూడా సీతాఫలం చెట్టు "మామిడికాయలు కాయడం తన వల్ల కాదని " చెప్పడానికి ప్రయత్నించింది.
కానీ రాము తన మాటలు వినలేదు. "నీకు రోజూ నీళ్ళు పోసేది నేను. నిన్ను ఈ పిచ్చిమొక్కల నుండి కాపాడేది నేను. నువ్వు పెరిగే ఈ నేల కూడా నాదే. నీ కోసం ఇన్ని చేస్తున్న నాకోసం నువ్వు మామిడిపళ్ళు కాయలేవా?
ఇక నీ మాట నేను వినను. నేను చెప్పినట్టు నువ్వు కూడా అందరిలాగే మామిడిపళ్ళు కాయాల్సిందే ! " అని తేల్చి చెప్పేశాడు. ఇక ఏం చెప్పాలో తెలియక సీతాఫలం చెట్టు మౌనంగా ఉండిపోయింది.
మరుసటి రోజు నుండి రాము నీళ్లు పోస్తున్నాడు కానీ, అక్కడ పిచ్చిమొక్కలు కొట్టడం మానేసాడు. ఇదివరకటిలా ఆ చెట్టును ప్రేమగా చూసుకోవడం మానేసాడు.
సీతాఫలం చెట్టు "మామిడికాయలు కాయడం తన వల్ల కాదని " ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించింది. తనకి అండగా నలవాల్సిన రాము యే అర్థం చేసుకోకపోవడంతో, సీతాఫలం చెట్టు ఒంటరితనానికి లోనయ్యింది.
" ఈ జన్మకి తను మామిడి కాయలు కాయలేదు, పోనీ సీతాఫలం కాయలు కాసి, అవి కూడా రుచిగా వుంటాయని చెప్పాలన్నా సరే, వర్షాకాలం వచ్చే వరకూ ఆగాలి ". కాబట్టి సీతాఫలం చెట్టుకి ఏం చేయాలో తెలియలేదు. అలా పది రోజులు తనలో తను మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చింది.
ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తరువాత
సీతాఫలం చెట్టు suicide చేసుకుని చనిపోయింది. చనిపోతూ... సీతాఫలం కాయలు కాయడానికి ముందు పూయాల్సిన పువ్వు పూసింది.......
తర్వాత రోజు సాయంత్రానికి సీతాఫలం చెట్టు ఆకులు ఎండిపోవడంతో, ఆ చెట్టు చనిపోయిందని రాముకి, లక్ష్మికి తెలిసింది. ఈ విషయం తెలిసిన భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడ్డారు. కానీ ఏం చేస్తాం! కథ చేజారిపోయింది.
సీతాఫలం చెట్టు మామిడి కాయలు కాయలేనట్టే , singer లేదా dancer అవుదామనుకున్నా మీ కొడుకు/కూతురు మీరు చెప్పిన పనినే చేయలేరు.
ఎండాకాలంలో మామిడికాయలు కాయలేకపోతే వర్షాకాలంలో సీతాఫలం కాయలు కాసే వరకూ ఆగాలి. మీ నాన్న అడిగినప్పుడు నీ talent ని నిరూపించుకోలేకపోతే నీ time వచ్చేంతవరకూ ఆగాలి. అలా కాదని suicide చేసుకుంటానంటే ఎలా ?
తల్లిదండ్రులు ఆవేశపడినా, పిల్లలు తొందరపడినా ఈ కథలో జరిగినట్టే జరుగుతుంది.
ఆత్మహత్య నేరమే కాదు, నీ వాళ్ళకి మోయలేని భారం కూడా!
- giribabu MR.
For parents
సీతాఫలం చెట్టు మామిడి కాయలు కాయలేనట్టే , singer లేదా dancer అవుదామనుకున్నా మీ కొడుకు/కూతురు మీరు చెప్పిన పనినే చేయలేరు.
మీరు అనుకున్న సమయానికి అనుకున్నదే కావాలంటే ఎలా? అయినా ఎక్కడో ఎవరో చేసింది చేయమనడం, ఇప్పుడు ఇదే నడుస్తుందని వాళ్ళని కూడా అదే దారిలో నడవమనడం కరెక్ట్ కాదు.
చూడండి! ఈ ప్రపంచంలో coffee పెట్టేవాడికైనా value ఉంటుంది కానీ, copy కొట్టేవాడికి మాత్రం value ఉండదు.
నిజంగా ఏదో చేయాలనుకున్న మీ పిల్లలు ఇంట్లో పరిస్థితుల గురించి కూడా ఆలోచిస్తారు. అలాంటి వారిని కంగారు పెట్టకండి. మీ పిల్లల్ని వదిలేయమనట్లేదు, కానీ వాళ్లు వెళ్లాలనుకున్న దారిలో మాత్రం వదిలేయండి.
తల్లిదండ్రులు అంత కఠినవంతులేం కాదు, కానీ పిల్లలు సున్నితవంతులు అయిపోయారే! దయచేసి మీ పిల్లల్ని ఒక మాట అన్న తర్వాత నుండి ఇంకో కంట కనిపెడుతూ ఉండండి.
వాళ్ళు గనుక ఆలోచించడం మొదలుపెడితే, చావు కూడా వాళ్ళకి చిన్న పనిలాగానే కనబడుతుంది. చదువు అయిపోయిన వెంటనే మీ అబ్బాయి జాబ్ చేయకపోయినా, మీ అమ్మాయికి పెళ్లి చేయకపోయినా ఏం కాదు! కొంచెం ఆగండి... వాళ్ళని కూడా ఎదగనివ్వండి....
For youngsters
ఎండాకాలంలో మామిడికాయలు కాయలేకపోతే వర్షాకాలంలో సీతాఫలం కాయలు కాసే వరకూ ఆగాలి. మీ నాన్న అడిగినప్పుడు నీ talent ని నిరూపించుకోలేకపోతే నీ time వచ్చేంతవరకూ ఆగాలి. అలా కాదని suicide చేసుకుంటానంటే ఎలా ?
నీకు ఇష్టమైన పనికి ఉన్న విలువ మీ నాన్నకి తెలియకపోతే చెప్పు, వినకపోతే చూపించు. అరే! చాలా ఈజీగా చనిపోతున్నావ్.... ఏం సాధిద్దామని? నువ్వు ఇలా ధైర్యం లేక ఛస్తే " నీ వాళ్లే ఏడుస్తారు, కొంచెం దూరపు వాళ్ళు ' అయ్యో ' అంటారు, అసలు సంబంధమే లేని వాళ్ళు ' వీళ్ళు ఇంక మారరు ' అనుకుంటారు " . ఈ జనానికి ' ఎందుకు జరిగింది ' అన్నది చాలా ముఖ్యం.
నీ చావుకి సరైన కారణం లేకపోతే, నువ్వు బతికిన బతుకుకు విలువ వుండదు.
నువ్వు బతికుంటే నీ ఫోటో whatsapp status లో పెట్టి HBD అని రాస్తారు. చనిపోతే అదే ఫోటో పెట్టి RIP అని రెండు ఏడుస్తున్న emoji లు పెడతారు. కొంపదీసి whatsapp group లో అయ్యో పాపం అని నీకోసం చేసుకునే పావుగంట చాటింగ్ కోసం చనిపోతున్నావా!
science లో చెప్పారు కదా, గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పక్క portion లో అమ్మానాన్నలను పెట్టి, ఇంకో portion లో నువ్వూ నీ లవర్ ఉండొచ్చు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు! అందులో ఎంత మంది అయినా పడతారు. ఒక అమ్మాయి 'అన్నయ్య' అంటే ఇంకో అమ్మాయిని లవ్ చెయ్... ఇంకా వాళ్ళ మీద కోపం తగ్గకపోతే బుక్ వ్రాయి, సినిమా తీయి.... అవన్నీ కాదని suicide చేసుకుంటానంటే ఎలా?
మరి! చదవలేక చచ్చిపోదామనుకుంటున్నావా? 100 supply exams రాయడం కన్నా, ఒక suicide letter రాయడం చాలా కష్టం....
మరి ఇంకేంటి! జాబ్ రావట్లేదా? ఆర్థికంగా ఇబ్బందిగా ఉందా? అంటే నువ్వు లేకపోతే ఈ problems solve అయిపోతాయా?
నువ్వు ఉన్నా లేకపోయినా, ఈ ప్రపంచం మాట సాయం మాత్రమే చేయగలదు... మిగతాదంతా నువ్వే చేసుకోవాలి.
Also read - 9 to 5
ఏదైనా పోతుంది అనిపిస్తే పోనీ! నువ్వెందుకు పోతున్నావ్? చేజారిపోతున్న దాని గురించి ఆలోచిస్తే చేతిలో ఉన్న దాన్ని miss అవుతావు.
నీ వాళ్ళకు నువ్వు బరువు అయ్యావనో, పరువు గంగలో కలిసిందనో, రేపు ఉన్నా చేసేదేమీలేదని చనిపోతే ఎలా? గడియారంలో బ్యాటరీలు తీసేసి నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది అంటే కుదరదు కదా!
ఏ వార్త హడావుడి అయినా ఇంకో వార్త వచ్చే వరకే! నిన్ను గెలిపించే ఆ రోజు వస్తుంది, కానీ నిన్ను ఓడించిన ఈ రోజు మళ్ళీ రాదు...
గుర్తుంచుకో! నీకు నచ్చిన పనిని చేయలేకపోతున్నావంటే నీకు రాక కాదు, తెలియక.... తెలుసుకుంటే సరి!
ప్రాణం పోతేనే అన్నీ పోయినట్టు, ప్రాణం అనుకున్నది పోతే కాదు.... అర్థమయ్యిందా! బ్రతికుండు....
ఏమైనా ఉంటే తరువాత చూసుకుందాం........
- giribabu MR.
Your doubt -
పై కథలో, సీతాఫలం చెట్టు తనకు తానే చనిపోవడం కుదరదు కదా అనిపించిందా ?
నిజమే! ఒక మనిషి కూడా తన ప్రాణం తానే తీసుకోవడం జరగని పని......
suicide is impossible...but it happens!
SUICIDE - Un Restricted Independence
Reviewed by Giribabu dola
on
May 15, 2020
Rating:
Good but... Please story ni precise cheyamdi...
ReplyDeleteSuper
ReplyDeleteGood message
ReplyDelete