art by S.Divya |
ఎందుకంటే వాళ్లకు కాలేజీలో నేర్పిన పాఠం అదే ! పుస్తకాల్లో లేకపోయినా పనిగట్టుకొని చెప్పే పాఠం " జాబ్ వస్తే settle అయిపోవచ్చు " అని.
ఇక అదే మాటను మనసులో పెట్టుకుని ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు , ఎవరో వేసిన పట్టాలపై తమ బండి నడుపుతున్నారు.
తెలిసినవారు వెళ్లారనో , తెలిసిన వాళ్ళు వెళ్ళమన్నారనో , తెలియకుండానే అక్కడికి వెళ్లి తిరుగుతున్నారు .
అలా
twenty five వచ్చేలోపే 9 to 5 circle లో పడిపోతున్నారు , అక్కడ తిరగడం తిప్పడం తప్ప వేరే option ఉండదు .
అలా వాళ్ళు వెళ్ళారు వీళ్లు వెళ్లారు అని వెళ్లే వాళ్ళు కొంతమంది అయితే , ఒకటి రెండు సార్లు ఓడిపోయినందుకే తమను తాము తక్కువగా చేసి చూసుకొని , యుద్ధం చేయలేక , అద్దంలో ముఖం చూసుకోలేక , అర్థం పర్థం లేని జీవితం గడుపుతున్న యువత చాలా మందే ఉన్నారు .
ఇంకొంతమంది అయితే అందాక ఇందులోకి వెళ్లి , ఆ తర్వాత అక్కడ నుండి మనం ఏంటో proove చేసుకుందాం అనుకుంటున్నారు .
అందాక ఇలా చేద్దాం , ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకున్నావంటే నీ జీవితం అంతంతమాత్రంగానే ఉంటుంది .
అయినా ఒక్క failure కే నువ్వేంటో అనేది ఎలా తెలిసిపోతుంది .
అయినా మొదటిసారే success అయితే అది స్టోరీ ఎలా అవుతుంది .
కొంతమంది పరిస్థితుల కారణంగా జాబ్ చేయాల్సి వస్తుంది . అయితే ఆ పరిస్థితులను దాటాల్సిన బాధ్యత ఎప్పటికైనా నీదే ! అంతేగానీ , ఆ పరిస్థితులతో నిన్ను నువ్వు పోల్చుకోకూడదు . పరిస్థితులతో
పోల్చుకోవడం , పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే . ఆ రెండూ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి .
నువ్వు ఎంత అందంగా ఉన్నా పగిలిపోయిన అద్దంలో నీ ముఖం అందం గా కనబడదు కదా !
( go through this link for story behind this quote
https://kadiarycreations.blogspot.com/2019/10/blog-post_12.html?m=1 )
నువ్వు నీడలో ఉన్నంత వరకూ నీ నీడ పడే బాధ నీకు తెలియదు .
ఒకరిని follow అయ్యే ముందు ఆలోచించు నిన్ను follow అయ్యే వాళ్లు కూడా ఒకరు ఉన్నారని , అదే నీ నీడ .
Don't follow the followers .
ఉన్నది ఒక్కటే life కాబట్టి life అంతా ఒకలాగే ఉండకు .
LIFE - Let's Involve in Future Efforts
- giribabu MR.
9 to 5
Reviewed by Giribabu dola
on
December 26, 2019
Rating:
No comments: