అనగనగనగనగా ... అంటూ ఎన్ని కథలు చెప్పినా మనం ఇంతేగా





నిన్నకి మొన్నకి ఉండదు తీరిక 
వెనకకు వచ్చి నిన్నే చేరగ

 ఒకటికి వందకి తేడా వెతకక 
దూరం ఒకటే వాటికి చీలిక 

ముందూ వెనకా ముందే వుండక
తికమకపెడుతూ నిన్నే తిప్పెగ

ఆశకి ఎందుకు అంతటి అలక 
కదలక మెదలక ఓ పక్కన వుండక



అలలకు కలలకు అలుపే రాదిక 
అలాంటి వాటితో నీకేల పోలిక 

ఎందుకు నీకా కమ్మని కోరిక 
ముసుగు తన్ని హాయిగా పడుకోక 

చీటికి మాటికి చిరాకు పడక 
పిసరంత నవ్వుని పరాకున నవ్వక

అందాన్నిచ్చిందా కళ్ళకు కాటుక 
మరి దాచావా నీ కన్నీటి కదలిక 

జెండా ఎగరాలి గర్వంగా 
అది ఏ మాత్రం మనకి పనికి రాదుగా 

అనుకున్నదాని కోసం అదేపనిగా ఆలోచించక 
అవ్వాల్సిందేదో అయ్యే తీరుతుందిగా 

రేపటి కోసమేగా నీ యీ నడక 
తెలియదా నీకు నీ యొక్క అమరిక

అంతా ఒకలాగే వెళ్తే ఎందుకు మనకీ కదలిక 
అందుకే నువ్వేంటో తెలుసుకో తీరిగ్గా 

గాలిపటంలా పైపైకి ఎగరలేక 
అది సరికాదని నాకు సర్ది చెప్పక 



ఇప్పటికైనా వదలవా ఆ అరిగిపోయిన పలక 
ఏం నేర్పింది నీకు ఆ మాట్లాడే చిలక 

నిన్న గంజి అన్నం తిన్నావని బాధపడక 
రేపు బిర్యానీయే తినాలని పట్టుబట్టక

ప్రయత్నించడం మాత్రమే నీ వంతుగా 
ఫలితం గురించి ప్లీజ్.... వదిలేయొచ్చుగా

పడిన చోటే పడినట్టు వుండక 
మొదలైన చోటుకి మళ్లీ రాకిక 

పనిగట్టుకొని పెద్ద చదువులు చదివినాక 
పని కోసం పరుగులు తీయాల్సిందేగా 



ముందుకా వెనకకా 
మధ్యలో మాత్రం అస్సలు వుండక

పరిస్థితులను చూసి బాధపడక 
కష్టాలను చూసి భయపడక 

అవసరాల కోసం అడ్డదారులు తొక్కక 
అనుభవాలతోనే మిగిలిన జీవితం గడపక 

ఉన్నదానితోనే సరిపెట్టుకోక 
ఊహలకు మాత్రమే పరిమితమవ్వక 



జనాలకి జవాబులు చెప్పక 
నీకు నువ్వు ప్రశ్నగా మిగలక



నవ్వించే వారి కోసం ఎదురు చూడక 
మళ్లీ చెబుతున్నా ! నవ్వించే వారి కోసం ఎదురు చూడక

ఎలా పడితే అలా అస్సలు బ్రతకక 
కనీసం ఎందుకో నీకైనా తెలుసుగా 

ఏదారైనా ఏదేమైనా , అనుకున్నది ఎప్పుడు ఆకాశమేగా 
ఎవ్వరికైనా ఎప్పటికైనా , అవసరమన్నది అవసరమేగా 

మరీ అంత perfection కోరుకోక 
ఎంత surf - excel వేసి ఉతికినా , బట్టలు అనుకున్నంత తెల్లగా రావుగా 

జీవితమంతా సందేహమేగా 
ఈ కవిత్వమంతా సందేశమేగా 



అనగనగనగనగనగనగా 
అంటూ ఎన్ని కథలు చెప్పినా మనం ఇంతేగా 

నేను ఎన్నైనా చెబుతాను ఓపిగ్గా 
కానీ ఎదగాల్సింది మాత్రం నువ్వేగా...............


- giribabu MR.


అనగనగనగనగా ... అంటూ ఎన్ని కథలు చెప్పినా మనం ఇంతేగా అనగనగనగనగా ... అంటూ ఎన్ని కథలు చెప్పినా మనం ఇంతేగా Reviewed by Giribabu dola on April 07, 2020 Rating: 5

2 comments:

Powered by Blogger.