ఏంటీ ! మీకు ఆకాశం అందటం లేదా ? ఇప్పుడెలా !



 

               రేవంత్ తన మావయ్య దగ్గర కూర్చొని తన మామయ్య చెప్పే మాటలు వింటున్నాడు . ఆ మాటలు విన్న రేవంత్  'ఎలాగైనా ' success అవ్వాలని అనుకున్నాడు . ఇంతకీ తన మావయ్య ఏమన్నాడంటే.....

చూడు రేవంత్ !  
ఈ ప్రపంచం చాలా పెద్దదిరా , అందులో నీ ప్రపంచం ఏంటో తెలుసుకోవాలి . ఇక్కడ ప్రతీదీ వింతే ,  అందులో నీ contribution ఎప్పటికీ కొంతే అని మర్చిపోకు . ఇక్కడ పాఠాల కన్నా గుణపాఠాలే గొప్పవి .


ఈ ప్రపంచంలో కన్నీరే ఎక్కువ కష్టపడుతుంది , అందువల్లనే అది అందరికీ అందుబాటులో ఉంటుంది.....



జీవితంలో చాలా ఎదురవుతాయి అందులో  కొన్నింటికి నువ్వు ఎదురెళ్లక తప్పదు .
 
చదువు అయిపోయిందనో , బాధ్యతలు ఎక్కువగా వున్నాయనో , పెళ్లి వయసు వచ్చేస్తుందనో ,  చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు . 



అవకాశం రావడానికి ఏముందెహే , నీకు ఆకాశాన్ని అందుకునే సత్తా వుండాలే గాని ! 

అనుకున్నది అవ్వలేదని ఎప్పుడూ కోప్పడకు , ఎందుకంటే గడియారంలో battery లు తీసేయడం , calendar లో ఈ రోజుని చింపేయడం తప్ప , కోపంలో ఇంకేది చేసిన తప్పే ! 



అప్పుడే పుట్టిన బిడ్డని తన తల్లి కూడా గుర్తు పట్టలేదు , అంటే success అవ్వన్నంతవరకూ అందరూ ఒక్కటే ! 

అయినా , success అవ్వాలంటే పెద్దగా ఏం చేయనక్కర్లేదురా ! నువ్వు రాత్రి పెట్టుకున్న అలారాన్ని కట్టేయకుండా ఉంటే చాలు. 
 ఏం చేసినా నీ ప్రమేయం వుంటేనే చేయి , ఎందుకంటే 
 ఈ లోకంలో మనిషికి విలువ ఉండదు , మనిషి చేసేదానికే విలువ ఉంటుంది,  ఎక్కడైనా సరే ! 




 కొంచెం different గా ఉండు , అయినా నిన్ను పట్టించుకునే తీరిక ఈ ప్రపంచానికి ఉందంటే నువ్వు different గా వున్నట్టే ! 

 అల్లుడూ !   నీ work excess అయితేనే success నీ వరకూ వస్తుంది .
success గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది . అందులో నేను నీకు చెప్పింది " నువ్వు నీ చిరిగిపోయిన చొక్కాకి పెట్టుకున్న పిన్నీస్ అంత " . సరేనా !  నీకు ఇవన్నీ చెప్పినా అర్థం కావు , వెళ్ళి పడుకో .

ఈ మాటలు విన్న రేవంత్  'ఎలాగైనా' తొందరగా success అవ్వాలని decide అయ్యాడు .  ఇప్పటివరకూ తను ఎంత సమయం వృధా చేసాడో తెలుసుకున్నాడు . మావయ్య చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాసుకున్నాడు . రోజుకి ఎంత సమయం చదవాలి , ఎలా కష్టపడాలి , అసలు మనం ఎందుకు success కావాలి అన్నదాని గురించి YouTube లో videos చూసాడు . తనకు వచ్చిన విధంగా ఒక time table వేసుకున్నాడు . ఉదయాన్నే 4 గంటలకే లేవాలని అలారం కూడా పెట్టుకున్నాడు . తన life లో ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తూ నిద్ర పోయాడు .

ఉదయాన్నే అలారం మోగింది . రేవంత్ నిద్ర లేచి fresh up అయ్యి , books అన్నీ ముందర పెట్టుకొని కూర్చున్నాడు .ఏ book తీసినా నిద్ర రావడంతో , life ని light తీసుకొని... light తీసేసి పడుకున్నాడు . ఎలాగో 9 th క్లాస్ మొత్తానికి తనే topper అన్న ధీమాతో !

( To be continued...... )       


   - giribabu MR.




ఏంటీ ! మీకు ఆకాశం అందటం లేదా ? ఇప్పుడెలా ! ఏంటీ ! మీకు ఆకాశం అందటం లేదా ? ఇప్పుడెలా ! Reviewed by Giribabu dola on March 30, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.