Just coincidence..... uneven love story



Just coincidence..... uneven love story

Just coincidence..... uneven love story


అది సాయంత్రం అయిదు గంటల సమయం . అమలాపురం గోఖలే సెంటర్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది . ఆ ట్రాఫిక్ లో సగం స్కూల్ , కాలేజీ బస్సులే ఉన్నాయి . ఆ రోడ్డు one way . ఒక కాలేజీ బస్సు పక్కనున్న రోడ్డు లోకి వెళ్తుండగా ఆగిపోయింది .
ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నిస్తున్నాడు .
Earphones లో పాటలు పెట్టుకున్నా సరే వినబడనంతగా horn sounds వినబడుతున్నాయి . దూరంగా ఉన్న మైక్ లో నుండి దుర్గమ్మ పాట చిన్నగా వినబడుతుంది .

 శేఖర్ " అసలు ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం
 లేదు " అన్నట్టుగా రోడ్డుకు ఎడమవైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన పక్కనుంచి బైకులు దాటుకుంటూ వెళ్ళినా పట్టించుకోవట్లేదు .

  కుడివైపున అన్ని బైకులు వెళ్తున్నా చూడని శేఖర్ ఒక
 బైక్ ని మాత్రం చూశాడు . ఆ బైక్ మీద ఒక అమ్మాయి yellow dress వేసుకొని long hair తో బైక్ వెనకాల కూర్చొని ఉంటుంది . ఆ బైక్ ని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నడుపుతున్నాడు .

 ఆ అమ్మాయి ఒక్కసారిగా ఎడమవైపు చూడడంతో , శేఖర్ ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు . 
ట్రాఫిక్ క్లియర్ అవడంతో కుడివైపు ఉన్న బండ్లు అన్నీ  కొంచెంకొంచెంగా కదులుతున్నాయి . ఆ అమ్మాయి 
శేఖర్ ని క్రాస్ చేయగానే , శేఖర్ right side కి వెళ్లి ఆ బండి వెనకాల పరిగెడుతున్నాడు . 

అలా పరిగెడుతున్న శేఖర్ ఒక్కసారిగా ఆగి రోడ్డు పక్కన పడి ఉన్న బండిని , దాని పక్కన రక్తంతో పడి ఉన్న మనిషిని చూశాడు . మళ్లీ ఒకసారి వెళ్తున్న అమ్మాయిని చూసి ... రోడ్డు పక్కన పడి ఉన్న మనిషిని చూసి వెంటనే అతని దగ్గరకు వెళ్లి భుజం మీద ఒక చేతిని తలకింద ఒక చేతినీ వేసి లేపడానికి ట్రై చేశాడు . తన
బలం సరిపోకపోవడంతో  మళ్లీ లేపడానికి ప్రయత్నిస్తుండగా శేఖర్ చేతి పక్కనే ఒక చెయ్యి , రోడ్డు పక్కన పడి ఉన్న అతని భుజం మీద ఇంకో చెయ్యి  పడడం గమనించాడు . శేఖర్ ఆ చెయ్యి ఎవరిదోనని ముఖం చూశాడు .  ఆ చేతులు తను ఇంతకు ముందు చూసిన అమ్మాయివే అవడంతో ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు . అప్పుడు ఆ అమ్మాయి అలా చూస్తూ ఉన్న శేఖర్ ని చూసి ' కొంచెం సాయం చేయండి ' అంది . ఇద్దరూ కలిసి అతన్ని లేవదీసి , అటుగా వెళ్తున్న ఆటో ఆపి , హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు .

డాక్టర్ వచ్చి పేషెంట్ ని తీసుకు వెళ్ళిన
 తరువాత , శేఖర్ మరియు ఆ అమ్మాయి ఒక బెంచి మీద కూర్చున్నారు . ఆ అమ్మాయి శేఖర్ తో తన పేరుని
" శ్రావణి " అని చెప్పింది . అలా ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నారు.......



మనం మనలా వున్నంత వరకూ , మనం ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్లవలసిన అవసరం లేదు... రాదు !



 మనం మనలా వున్నంత వరకూ , మనం ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్లవలసిన అవసరం లేదు... రాదు !

(To be continued.....)


- giribabu MR.


Just coincidence..... uneven love story Just coincidence..... uneven love story Reviewed by Giribabu dola on November 06, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.