కూతురి డైరీలో నాన్న కల



" పరిస్థితులతో పోల్చుకోవడం , పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం - రెండూ ఒకటే ! అవి రెండూ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి "

(Story behind the quote)

ఏదోలాగ వెతికి , ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేనటువంటి కాలేజీలను options లో పెట్టుకున్నాడు . దేవుడి దయవల్ల తన కుటుంబ పరిస్థితులకు తగ్గట్టు రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. చదువు పూర్తి అవడానికి ఎలాగో నాలుగు సంవత్సరాలు పడుతుంది . చదువుతుండగానే ఒక part-time జాబ్ చూసుకుని ఆ జాబ్ చేస్తుండేవాడు . పనికి వెళ్తున్నా సరే చదువును మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు . తన చదువు , తన ప్రపంచం అంటూ వుంటూనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దాకా వచ్చేశాడు. ఫ్రెండ్స్ తో కూడా బాగానే ఎంజాయ్ చేసేవాడు . ఖాళీ సమయంలో dance practice చేసేవాడు .

ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో వుండగానే ఇంటి పరిస్థితులు , కాలేజీ వాతావరణంను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు . అదేమిటంటే    " చదువు పూర్తి అయ్యేలోపల ఒక మంచి జాబ్ సంపాదించాలని  " . ఎంత గట్టిగా కోరుకున్నాడో ఏంటో ! ఒక మంచి కంపెనీ లో  30000 రూపాయల వుద్యోగం వచ్చింది .

 ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ కంపెనీలో చేరాడు . వచ్చే జీతం లో కొంత డబ్బుతో అమ్మ పాడిన ఒక చీటీ కడుతూ, మిగిలిన డబ్బులు ఇంటికి పంపుతున్నాడు . ఆలా రెండు సంవత్సరాలు తనకి తెలియకుండానే గడిచిపోయాయి.

కంపెనీకి తాను వ్రాసిన బాండ్ గడువు కూడా పూర్తయింది. తను పడిన కష్టానికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది .ఇక ఇప్పుడు సొంత ఇల్లు కట్టించే పనిలో పడ్డాడు .  కాలం పరిగెడుతుంది అన్న విషయం మన వయసు పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది .ఆ పరుగుపెట్టే కాలం అప్పటికే ఒంటి మీదకి 27 ఏళ్లను తీసుకువచ్చింది . మళ్ళీ దేవుడి దయ వల్ల పెళ్లి కూడా అయిపోయింది . మంచి అమ్మాయిని చేసుకోవడం వల్ల జీవితం బాగానే సాగుతుంది . ఇక తన డైరీలో రాసుకున్న ఆఖరి అద్భుతమైన విషయం ఏమిటంటే " తనకి అమ్మాయి పుట్టింది " అని .

 ఇక గిరి తన డైరీని రాయడం మానేసి తన పాప  కోసం ఒక డైరీ కొన్నాడు . చిన్నప్పటి నుంచి పాప చేసే పనులు అందులో రాద్దామని కొన్నాడు . ఇప్పుడు గిరి తన పాప డైరీలో వ్రాసిన మొదటి మాట " అమ్మా ధరణి ! నా కుటుంబ పరిస్థితుల వాళ్ళ నేను dancer ని కాలేకపోయాను . కాబట్టి నిన్ను అయినా మంచి dancer ని చేస్తానురా ! " అని .

గిరి అప్పటి తన పరిస్థితుల కారణంగా  తన కలను నెరవేర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, కల మాత్రం అలానే వుంది . ఆ కల ధరణి రూపంలో మళ్ళీ చిగురించింది , కానీ ధరణి పరిస్థితీ ! ......

 కథ ఇంకా ఉందనుకోకండి ! already పైన ఫొటోలో చదివారుగా.....

" పరిస్థితులతో పోల్చుకోవడం , పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం - రెండూ ఒకటే ! అవి రెండూ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి " . 

( May be to be continued...... )


 - giribabu MR.




కూతురి డైరీలో నాన్న కల కూతురి డైరీలో నాన్న కల Reviewed by Giribabu dola on October 12, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.