U/A - commercial story...
[ ముఖంలో ఎటువంటి టెన్షన్ లేకుండా, కూల్ గా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు శివ ]
స్టేషన్ బయట ఉన్న కానిస్టేబుల్... లోపలకు వెళ్తున్న శివను ఆపి “ ఎవరు కావాలి ” అని అడిగాడు.
“ నేను CI గారిని కలవాలి ” అని శివ భయపడకుండా చెప్పాడు.
“ విషయం ఏమిటి? ”
“ అన్ని టెస్టుల్లో సెలెక్ట్ అయ్యాను, కానీ నా జాయినింగ్ ఆర్డర్ మాత్రం ఇంకా రాలేదు... ఒకసారి ఈ విషయం సార్ కి చెబుదామని! ” అని శివ మెల్లగా కానిస్టేబుల్ కి చెప్పాడు.
కానిస్టేబుల్ పక్కకు తిరిగి “ ఇదేదో మనకి ఉపయోగ పడేలా వుందే ” అని తనలో తానే మాట్లాడుకుని... అత్యుత్సాహంతో “ పదండి సార్! CI గారి దగ్గరకు నేను తీసుకెళ్తాను” అని శివను CI దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
“ సార్! న్యూ జాయినింగ్ ”
CI కానిస్టేబుల్ ని చూసి చిన్నగా నవ్వాడు.
“ అవును సార్! ఆ అబ్బాయే... ”
శివ CI కి గుడ్ మార్నింగ్ చెప్పి, అతను కూర్చోమని చెప్పిన తరువాత కూర్చున్నాడు.
CI , శివ ఎదురెదురుగా కూర్చున్న తరువాత... ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు...
“ ఆ... పేరేంటి? ”
“ శివరామ్ సార్! ”
“ శివరామ్! ” అని టేబుల్ మీద వున్న ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ... “ ఆ అమలాపురం SI పోస్ట్ కి సెలెక్ట్ అయ్యింది నువ్వే కదా! ”
“ అవును సార్! జాయినింగ్ ఆర్డర్ ఈ పాటికే రావాలి కానీ ఇంకా రాలేదు... ”
CI ఆ ఫైల్ టేబుల్ మీద పడేసి “ రాదు! ఎందుకు వస్తుంది? నువ్వే ఇక్కడికి రావాలి! ఆ విషయం తెలీదా? ”
శివ అమాయకంగా “ తెలీదు సార్! ”
CI టేబుల్ డ్రాయర్ లో నుంచి నెయిల్ కట్టర్ తీసి, చేతి గోళ్లలో మట్టి తీసుకుంటూ “ ఊ! మరేంటి... జాయిన్ అవ్వడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది! ” అని చాలా తీరిగ్గా మాట్లాడాడు.
“ అవును సార్! ” అని శివ కూర్చిలో కొంచెం కదిలి నిటారుగా కూర్చున్నాడు.
“ intime లో జాయిన్ అవ్వాలంటే formality finish చేయాలి, ఊ! formality... ”
“ formality అంటే సంతకం పెట్టాలా సార్! ” అని మెల్లగా అడిగాడు శివ.
ఆ మాట వినగానే CI కానిస్టేబుల్ ఒకరినొకరు ఇలా ( 🙄 )చూసుకున్నారు.
“ ఛు! చెప్పవయ్యా... ” అని CI కానిస్టేబుల్ కి చెప్పగానే...
కానిస్టేబుల్ శివతో “ ఎంత... నువ్వు ఎంత ఇవ్వగలవ్? ”
“ అంటే లంచమా? ”
“ నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో! ఇక్కడో కట్ట పెట్టు, ఈ సర్టిఫికెట్ పట్టుకెళ్లు... ”
“ అర్థమయ్యింది సార్! అన్నింటిలో ఫస్ట్ వచ్చిన నాకు, జాయినింగ్ లెటర్ ఇంకా రాకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమయ్యింది... నేను లంచం ఇవ్వను సార్! ” అని శివ తెగేసి చెప్పేశాడు.
“ లంచం...! ఇప్పట్లో ఏ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఖచ్చితంగా సమర్పించాల్సిన లాంఛనం!
కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో ” అని చాలా ఓపికగా CI శివకి చెప్పాడు.
“ మీరు అడుగుతుంది కాగితాన్ని కాదు సార్, నా క్యారెక్టర్ ని! దాన్ని చంపుకుని రూపాయి ఇచ్చినా సరే... నేను చనిపోయినట్టే!
అయినా నేను ఈ దారిని ఎంచుకుంది మీలాంటి వాళ్ళను మార్చడానికి, అంతేగానీ మీలాంటి వాళ్ళ వల్ల నేను మారిపోవడానికి కాదు సార్!
వుంటాను సార్! నేనైతే లంచం ఇవ్వలేను ” అని కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోతుంటాడు.
వెళ్తున్న శివను చూసి CI నవ్వుతూ “ నీలా నీతులు చెప్పే వాడికి ఇప్పట్లో కోతులు కూడా ఊ కొట్టవు! ” అని CI కూర్చీలో నుంచి లేచి, శివ భుజం మీద చేయి వేసి “ చూడూ! నువ్వు చేయాలనుకున్న మంచి, సాయం లాంటివి ఇక్కడ ఉంటేనే ఏ అడ్డూ లేకుండా చేయగలవ్, సరేనా! ” అని అనగానే
శివ తన భుజం మీద CI చేయి తీసేసి “ ఇక్కడుంటేనో, ఇంకెక్కడో ఉంటేనో ఒక పనిని చేయగలను అనుకోవడం పొరపాటు సార్! ఇక్కడ అనుకుంటే ఏ పనినైనా చేయగలం ” అని చెప్పి కోపంతో బయటకు వచ్చేసాడు.
అలా కోపంతో బయటకు వచ్చిన శివ... అక్కడే బల్ల మీద వున్న యూనిఫాంని చూస్తూ ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నాడు
“ ఏం చెప్పను? ఏం చెప్పను! నాలుగేళ్లుగా మనకు వచ్చి తీరుతుంది, మనం అనుకున్నది చేయగలం అని నచ్చజెప్పుకుంటూ వస్తున్నానే, దీనికి ( తన హార్ట్ ని చూపిస్తూ ) ఏం చెప్పను...
ఖచ్చితంగా నేను సాధించగలను, ఆ తరువాత మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చి వచ్చానే, నా ఫ్యామిలీకి ఏం చెప్పను?
నువ్వే జీవితం అనుకున్న నాకు నువ్వు ఇచ్చిన జవాబు ఇది! నువ్వు లేకపోతే నేను ఏం చేయలేనని చెప్పాడు. ఇప్పుడు చెబుతున్నా! నీతో నాకు అవసరం లేదు.నీకు నాతో అవసరం ఉంటే... నువ్వే నా దగ్గరకి రా! నే వెళ్తున్నా... ” అని చెప్పి అక్కడ నుండి శివ వచ్చేసాడు.
[ అదే పోలీస్ స్టేషన్ కి అర కిలోమీటర్ దూరంలో ఉన్న SKBR కాలేజ్ దగ్గర... ]
కొలగాని స్వామినాయుడు దగ్గర చేరాలనుకుంటున్న నలుగురు కుర్రాళ్ళు, సాయంత్రం నాలుగు గంటలకు... కాలేజ్ బయట ఉన్న బస్ స్టాప్ లో కూర్చోడానికి వచ్చారు. కాలేజ్ అప్పుడే వదలడంతో... స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తున్నారు.
అలా బయటకు వస్తున్న అమ్మాయిలను చూస్తూ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు...
“ ఏంట్రా ఈ అమ్మాయిలు! అందరికీ ఒకలాగే ఉండే వాటిని కప్పేస్తారు, వేరువేరుగా ఉండే వాటిని మాత్రం చూపిస్తారు ”
“ ఆహా! అందరికీ ఒకలాగే వుంటుంది అనుకుంటే నీది నువ్వే చూసుకో! ”
“ వాడిది వాడు చూసుకుంటే ఏం బాగుంటుంది గానీ, ముందు ఆ అమ్మాయిని చూడండి ”
“ చిన్న పిల్లలా ఉంది, ఇంక చూడడానికి ఏం వుంటుంది అక్కడ! ”
“ ఆ విషయం చున్నీ తేస్తెనే కదా తెలుస్తుంది! ”
“ తీసేమంటావా? ”
“ తీసేరా! ఇలాంటివి చేస్తేనే కదా, అన్న దృష్టిలో పడేది! ”
ఆ కుర్రాళ్లలో ఒకడైన జాని స్వర్ణ చున్నీ లాగడానికి తయారయ్యాడు. జాని మెల్లగా స్వర్ణ వెనకాల నడుచుకుంటూ వెళ్లి, వెనకనుండి స్వర్ణ చున్నీని పట్టుకుని లాగాడు. చున్నికి పిన్నిస్ పెట్టుకోవడం వల్ల, జాని చున్నీ లాగగానే, స్వర్ణ ఒక్కసారిగా ఆ రోడ్డు మీద వెళ్తున్న బైక్ మీద పడిపోయింది. ఆ బైక్ మీద వస్తున్న శివ వెంటనే బ్రేక్ వేయడంతో, స్వర్ణకి ఏం కాలేదు.
వెంటనే శివ బైక్ దిగి కిందపడిన స్వర్ణని లేపి... చున్నీ లాగిన జానిని చూస్తాడు. కొలగాని స్వామినాయుడు దృష్టిలో పడాలనే ఇలా చేయడం వల్ల... ఆ కుర్రాళ్ళు అక్కడి నుండి పారిపోలేదు.
చుట్టూ స్టూడెంట్స్ నిలబడ్డారు. మిగతా ముగ్గురూ జాని దగ్గరకి వచ్చి నిలబడ్డారు. అందరూ చూస్తుండగానే, జాని ఆ చూన్నీని మెల్లగా తన ప్యాంట్ లోకి తోసి, బయటకు తీసి... స్వర్ణ మీదకు విసిరేశాడు.
ఇదంతా శివతో సహా చుట్టూ ఉన్న స్టూడెంట్స్ చూస్తూనే ఉన్నారు.
( To be continued... )
- giribabu MR.
No comments: