MR. MOTIVATES అనే యూట్యూబ్ ఛానెల్ ప్రతి నెల ఒక వీడియోని తీసి, దాని ద్వారా ఒక పనికొచ్చే విషయం జనాలకి చెబుతారు. ఆ రోజు వీడియోలో భాగంగా, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన జనాల భాధలు అడిగి తెలుసుకుందామని, కెమెరా మైక్ పట్టుకుని ఆ ఛానెల్ టీం విజయ విహార్ జంక్షన్ కి వెళ్ళారు.
అది పెద్ద జంక్షన్. రెండు దారులకు రెడ్ సిగ్నల్ పడింది. మూడో దారికి yellow సిగ్నల్ పడింది. రెడ్ సిగ్నల్ పడిన దారిలోకి కెమెరా మైక్ పట్టుకుని వెళ్ళారు టీం. మైక్ పెట్టి ఒక్కొకరినీ “ ఇంకా మీరు ఎంత సేపట్లో మీ గమ్యం చేరాలి ” అనే ప్రశ్న అడగటం మొదలు పెట్టారు. ఆ ట్రాఫిక్ లో వున్నవాళ్ళు ఇలా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు.
ఆఫీస్ కి వెళ్ళాల్సిన అతను : ఇంకా అరగంట మాత్రమే టైమ్ ఉంది. లేటుగా వెళ్తే బాస్ తిడతాడు.
స్కూల్ కి వెళ్ళే అమ్మాయి : ఇంకా 25 మినిట్స్ మాత్రమే ఉంది. క్లాస్ వినాలంటే మేడం కన్నా ముందే క్లాసులోకి వెళ్ళాలి. లేదంటే బయటే!
హాస్పిటల్ కి వెళ్ళే పెద్దతను : ఇంకా 20 మినిట్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు వెళ్లి కలవకపోతే, మళ్ళీ ఇంకో వారం వరకూ నా కొడుకుకి ఖాళీ దొరకదు.
ఇంటర్వ్యూ కి వెళ్ళే కుర్రాడు : ఇంకా పావుగంట మాత్రమే ఉంది. సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు కానీ, ఇంటర్వ్యూకి మాత్రం అటెండ్ అవ్వాలి. అసలే ఇది నా లవర్ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసిన కంపెనీ!
ట్రైన్ క్యాచ్ చేయాల్సిన అబ్బాయి : ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఈ ట్రైన్ గానీ మిస్ అయితే, మళ్ళీ రిజర్వేషన్ దొరికే వరకూ మా అత్తా మావయ్యలు ఇక్కడే వుండిపోవాల్సి వస్తుంది.
మూవీకి వెళ్ళాల్సిన కుర్రాళ్ళు : ఇంకా పావుగంట మాత్రమే ఉంది. టైటిల్స్ మిస్ అయితే బెనిఫిట్ షో చూసినట్టే ఉండదు.
competitive exam కి వెళ్ళాల్సిన అమ్మాయి : ఇంకా 40 మినిట్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు రాయకపోతే మళ్ళీ ఎప్పుడు తీస్తాడో తెలియదు.
అనుకోకుండా అదే ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ : ఇంత టైమ్ లో వెళితే ప్రాణాన్ని కాపాడవచ్చు అని వుంటుంది కానీ, ఎంత తొందరగా వెళితే అంతా మంచిది.
పైన చెప్పిన ప్రతి ప్రోబ్లం కీ వేరే సొల్యూషన్ వుంది. తిడితే పడొచ్చు... నిలబెడితే నిలబడొచ్చు... ఈ ట్రైన్ మిస్ అయితే వేరే ట్రైన్... ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ...
కానీ అంబులెన్స్ కి మాత్రం ఒకటే దారి. “ తొందరగా వెళితే ఒక ప్రాణం కాపాడవచ్చు... ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా! ”
so, please provide a path to AMBULANCE!
ఒకవేళ ఆలస్యం అయిందని ఎవరైనా నిలదీస్తే. “ selfie with ambulance ” అని ఒక ఫోటో చూపించండి... గర్వంగా!
- giribabu MR.
Reviewed by Giribabu dola
on
March 14, 2021
Rating:



Super Giri
ReplyDelete