అప్పుడప్పుడూ......
అందరూ గొప్పవాళ్ళు అయ్యే సదావకాశం వచ్చింది !
అది కూడా కేవలం ఒక గంటలోనే !
ఈ అవకాశం 3 నెలలకు ఒకసారి మాత్రమే.....
దీనికి పైసా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు
రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు
చెమట చుక్క చిందించవలసిన అవసరం లేదు
చేతులతో బరువులు ఎత్తవలసిన పనీ లేదు
మీ ఆలోచనకు పదును పెట్టవలసిన అవసరం లేదు
మీ నైపుణ్యాలను వాడవలసిన అవసరం లేదు
ఎటువంటి సిఫార్సు అవసరం లేదు
మరే ఇతర వృత్తులలో అనుభవం అవసరం లేదు
అందంతో పని లేదు
అభినయంతో పని లేదు
ఎటువంటి సమాచార నైపుణ్యాలు అవసరం లేదు
రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు
చెమట చుక్క చిందించవలసిన అవసరం లేదు
చేతులతో బరువులు ఎత్తవలసిన పనీ లేదు
మీ ఆలోచనకు పదును పెట్టవలసిన అవసరం లేదు
మీ నైపుణ్యాలను వాడవలసిన అవసరం లేదు
ఎటువంటి సిఫార్సు అవసరం లేదు
మరే ఇతర వృత్తులలో అనుభవం అవసరం లేదు
అందంతో పని లేదు
అభినయంతో పని లేదు
ఎటువంటి సమాచార నైపుణ్యాలు అవసరం లేదు
ఏంటీ! ఆశ్చర్యంగా ఉందా ?
ఇంతకీ నేనేమి చేయాలి అని ఆత్రుతగా ఉందా ?
ఇంతకీ నేనేమి చేయాలి అని ఆత్రుతగా ఉందా ?
సరే! మీకు 18 సంవత్సరాలు నిండి వున్నాయా ?
మీరు 50 కిలోల బరువు కలిగి వున్నారా ?
మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా ?
మీరు 50 కిలోల బరువు కలిగి వున్నారా ?
మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా ?
అయితే ఈ రోజే మీ రక్తాన్ని దానం చేయండి,గొప్పవాళ్ళు అవ్వండి !
ఎలా అంటారా !
ఒక తల్లి తన రక్తాన్ని పంచి ఒక బిడ్డకు జన్మనిచ్చి గొప్ప పేరు (అమ్మ) సంపాదించుకుంది,
ఒక సైనికుడు తన రక్తాన్ని చిందించి తన దేశ ప్రజలను కాపాడుతూ గొప్పవాడు అనిపించుకుంటున్నాడు,
అలాగే మనం కూడా మన రక్తాన్ని యిచ్చి ఆపదలో వున్నవారిని కాపాడి 'గొప్పవాళ్ళం' అనిపించుకుందాం !
ఒక సైనికుడు తన రక్తాన్ని చిందించి తన దేశ ప్రజలను కాపాడుతూ గొప్పవాడు అనిపించుకుంటున్నాడు,
అలాగే మనం కూడా మన రక్తాన్ని యిచ్చి ఆపదలో వున్నవారిని కాపాడి 'గొప్పవాళ్ళం' అనిపించుకుందాం !
అప్పుడప్పుడూ చేసే రూపాయి దానం కన్నా, ఎప్పుడో ఒకసారి చేసే రక్తదానం ఎంతో మిన్న !
ఇదే కథను ఈ క్రింది వీడియోలో చూసి అర్థం చేసుకోవచ్చు
ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ,
రక్తం అనేది అరుదుగా దొరుకుతుంది . అది అవసరానికి దొరుకుతుంది అని మాత్రం చెప్పలేము . ఎంత డబ్బు ఉన్నా సరే , ఒక రక్తపు చుక్కని మనం సొంతంగా తయారు చేయగలమా ? కానీ , అది ఒకరి దానం వల్ల సాధ్యం అవుతుంది .
ఈరోజు అవసరం వేరే వాళ్ళది కదా అని మనకెందుకులే అనుకుంటే , రేపు అది మనదాక వస్తుంది .
మీరు ఎంత ధనం దానం చేసినా అది అప్పటికే , కానీ ఇంధనం దానం చేస్తే ఆ రుణం బ్రతికి ఉండే దాకా !
అలాగని అందరూ రక్తదానం చేయడానికి అర్హులు కాదు . దానికంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి . ఆ నిబంధనలన్నీ ఒక కథగా రూపొందించి ఈ వీడియోని చిత్రీకరించడం జరిగింది . వీడియోని ఒకసారి చూసి , మీ అర్హత తెలుసుకొని వీలైనంతవరకూ రక్తదానం చేయడానికి ముందుకు రండి .
మీ దానం ఖరీదు ఇంకొకరి ప్రాణం .
మీరు అర్హులు అయితే మీ దగ్గరలో ఉన్న రక్తదాన శిబిరానికి వెళ్ళి మీ రక్తాన్ని దానం చేసి మీ డైరీలో గొప్పగా రాసుకోండి . గొప్ప పనులు గొప్ప సాహసాలు మనలో నుంచే పుడతాయి మన మనుషుల్లో నుంచే పుడతాయి .
మీ అవసరం మిమ్మల్ని ప్రశ్నించక ముందే , ఎదుటివారి అవసరానికి మీరు సమాధానం చెప్పండి .
మళ్ళీ గుర్తు చేస్తున్నా !
అప్పుడప్పుడూ చేసే రూపాయి దానం కన్నా, ఎప్పుడో ఒకసారి చేసే రక్తదానం ఎంతో మిన్న !
- giribabu MR.
అప్పుడప్పుడూ......
Reviewed by Giribabu dola
on
August 20, 2019
Rating:
No comments: