1.అంకితం... అమ్మానాన్నలకు మాత్రమే !
•అమ్మానాన్నల tension ఏదైనా intension మాత్రం పిల్లల క్షేమమే
•నిజమైన ప్రేమకు ఋజువైన రూపాలు తల్లిదండ్రులు
•నన్ను కనిపెట్టిన రూపం అమ్మ, నన్ను నడిపించే దీపం నాన్న
•నాన్నంటే భయం కాదు, అభయం, అది తెలుసుకుంటే నీదే విజయం.
2.అమ్మానాన్నలను వదిలేసిన అబ్బాయి మారితే..
•నా ప్రతి కష్టాన్నీ తీర్చినప్పుడు తెలియదు
మీ ఏ కష్టాన్నీ నేను తీర్చనని
జోల పాడి నిద్ర పుచ్చినప్పుడు తెలియదు
మీకు నిద్ర లేకుండా చేస్తానని
నడక నేర్పినప్పుడు తెలియదు
అది నేర్చుకునే ఇంత దూరం నడుస్తానని
చీరకొంగు పట్టుకుని తిరిగినప్పుడు తెలియదు
చీర కూడా కొనకుండా వదిలేస్తానని
కళ్ళలో పెట్టుకొని చూసినప్పుడు తెలియదు
మీ కంటికి కనిపించనంత దూరం వెళ్తానని
బాధల్లో ఓదార్చినప్పుడు తెలియదు
మీ బాధలకు కారణం నేనే అవుతానని
అందరిలో ఒక్కడిగా నన్ను చూడాలనుకున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిలో నిలబెట్టినా ఏం అనకుండా వెళ్తున్నారు
అసలు ఇప్పటికీ ఆ ప్రేమను అర్ధం చేసుకోలేకపోతున్నాను
"చాలు" అనే వరకూ అన్నం పెట్టే అమ్మకి "ఇక చాలు" అని దణ్ణం పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోకండి....
3.అమ్మానాన్నల ప్రేమకు దూరమైన వాళ్ళకు..
•అందమైన జన్మనిచ్చిన అమ్మ అందుబాటులో లేదని, నిన్ను నలుగురికీ పరిచయం చేసిన మీ నాన్న నీ వెనకాల లేడని చింతించకు
ఆమె గుండె ధైర్యాన్ని నీకు ప్రాణంగా పోసి,ఆయన కష్టాన్ని నీకు ప్రేమ రూపంలో పంచి, అందమైన నిండు మనస్సుతో ఎల్లప్పుడూ వాళ్ళ దీవెనలు నీ వెంటే వుంటాయి.
- giribabu MR.
అమ్మానాన్నలపై మన అభిప్రాయం నా మాటల్లో
Reviewed by Giribabu dola
on
October 11, 2019
Rating:
No comments: