జిగీష _ The first/last hope

 


  ∆  - లక్ష్మణ్ కథ
  ∆  - గానుగ చెట్టు కథ
  ∆  - background voice


లక్ష్మణ్ కి 13 సంవత్సరాలు. అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి. ఐదో తరగతి వరకూ చదివాడు. చదువు సరిగ్గా చదవకపోవడంతో, లక్ష్మణ్ ని వాళ్ళ అమ్మ పాలేరు పనికి పంపించింది. లక్ష్మణ్ కి ఒక అన్నయ్య ఉన్నాడు. అతను కూడా చదువు మానేసి తాపీ పనికి వెళుతున్నాడు. అమ్మ పొలం పనికి వెళ్తుంది. నాన్న ఆరోగ్యం బాగా లేక ఇంట్లోనే ఉంటాడు ( ఎప్పటికీ ).

 లక్ష్మణ్ రోజూ ఉదయం 8 గంటలకు పనికి వెళ్తాడు. 10 గంటలకు ఆ ఊరిలో ఖాళీగా ఉన్న గ్రౌండ్ కి గేదెలను తోలుకొని వెళ్తాడు. ఆ గ్రౌండ్ లో నేల మొత్తం  ఎండిపోయి, పగిలిపోయి ఉంటుంది. కానీ ఆ గ్రౌండ్ కి చివర్లో గడ్డి ఉంటుంది. గేదెలను ఆ గడ్డిలో వదిలేసి, ఆ గ్రౌండ్ మధ్యలో ఉన్న గానుగ చెట్టు కింద లక్ష్మణ్ కూర్చుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ time pass కోసం ఆ చెట్టుక్రింద వున్న చీమలని చంపడం, చెట్టు మీద పేర్లు చెక్కడం, గేదెల మీద కాకులు వాలితే గానుగ పిక్కలతో ఆ కాకులను కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు.

 ఆ గ్రౌండ్ కి అవతల ఒక కాలువ ఉంది. అది గోదావరి కాలువ. ఆ ఊరికి నీటి అవసరాలు తీర్చేది ఆ కాలువనే. సాయంత్రం అవగానే లక్ష్మణ్ గేదెలను ఆ కాలువలోకి తీసుకెళ్లి, వాటిని కడిగి owner ఇంటికి తీసుకెళ్తాడు. ఇదే లక్ష్మణ్ రోజూ చేసేది.

 లక్ష్మణ్ కి ఒక గమ్యం ఉంది. తను చెట్టుకింద ఒక్కడే ఖాళీగా కూర్చున్నప్పుడు, బోర్ కొట్టకుండా వుండడానికి ఒక touch phone కొనుక్కోవాలని తన గోల్.

 కథలో లక్ష్మణ్ ఒక్కడే ఉంటే మనకి బోర్ కొడుతుంది కదా! లక్ష్మణ్ నీడ కోసం కూర్చునే గానుగ చెట్టుకు కూడా ఈ కథలో పాత్ర ఉంది.

ఆరు సంవత్సరాల క్రితం ఆ గానుగ చెట్టు అక్కడే పుట్టింది. తనతో పాటు చాలా మొక్కలు పుట్టాయి. కానీ ఎదిగిన తర్వాతే తెలిసింది! అవన్నీ మొక్కలు మాత్రమేనని, తను మాత్రమే చెట్టు అని. 3 సంవత్సరాల క్రితం ఆ నెల మొత్తం మెత్తగా, సారవంతంగా ఉండేది. ఒక తాత ఆ నెలలో మొలిచే గడ్డిని రోజూ కోసుకుని వెళ్ళేవాడు. తాత రావడం మానేసిన తర్వాత, ఆ నేలని మొత్తం గ్రౌండ్ గా మార్చేసి వాడుకుంటున్నారు చిన్నపిల్లలందరూ. 

ఆ గ్రౌండ్ లో మొక్కలనూ, చిన్న చిన్న చెట్లనూ కొట్టేసి, గానుగ చెట్టును మాత్రం  నీడ కోసం వదిలేశారు. ఆ స్థలం owner ఆ గ్రౌండ్ ని అమ్మేద్దాం అని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఇలా, ఆ గ్రౌండ్ మధ్యలో గానుగ చెట్టు ఒక్కటే రెండు సంవత్సరాల నుండి ఒంటరిగా ఉంటుంది. 

గానుగ చెట్టుకు కూడా ఒక గమ్యం ఉంది. అది ఏమిటంటే " ఆ గ్రౌండ్ కి అవతల ఉన్న కాలవ గట్టు దగ్గరకు వెళ్లి, అక్కడే ఉండాలని. ఎందుకంటే ఆ కాలువ దగ్గరకు రోజూ మనుషులు వస్తారు. అక్కడ చాలా చెట్లు ఉంటాయి. సాయంత్రం అయితే పిల్లల ఆటలూ, ఎప్పుడూ కదిలే నీరు...... అలాంటి వాతావరణంలో ఉండాలని ఆ గానుగ చెట్టు కోరిక " .

తను ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్న విషయం వాళ్ళ అమ్మతో చెప్పాడు. అయితే లక్ష్మణ్ కి వచ్చే 6 వేల రూపాయల జీతంలో నెలకు 1000 రూపాయలు ఇస్తానని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆ డబ్బులతోనే ఫోన్ కొనుక్కోమని అంది. ఇక ఫోన్ కొన్న తర్వాత ఆ ఫోన్ ఎలా వాడాలో తెలియదు కాబట్టి, లక్ష్మణ్  ముందుగానే వాళ్ళ అన్నయ్య ఫోన్ లో " whatsapp ఎలా వాడాలి, tik tok ఎలా చేయాలి, pub g ఎలా ఆడాలి " అన్నీ నేర్చేసుకున్నాడు.

లక్ష్మణ్ ఒక్కరోజు కూడా పని మానేవాడు కాదు. ఇంకో విషయం! రెండు రోజులకు ఒకసారి, ఆ గానుగ చెట్టు కింద తాగి పడేసిన beer bottles ఉంటాయి. ఆ మిగిలిన bottles లో చుక్కలను లక్ష్మణ్ taste చేస్తూ ఉంటాడు. అలా లక్ష్మణ్ నెల రోజులు ఎప్పుడు అవుతాయా అని ఎదురుచూస్తున్నాడు.

 ఆ గానుగ చెట్టుకు ఆ గ్రౌండ్ ని అమ్మబోతున్నారన్న విషయం తెలియదు ' తను నీడను ఇవ్వడం వల్లనే ' తనని ఇంకా నరకకుండా ఉంచారని అనుకుంటుంది. ఒక పెద్దాయన ప్రతిరోజూ ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి గానుగ పుల్లని విరుచుకుంటాడు. అంతకు మించి తన వల్ల ఇంకేం ఉపయోగం లేదని అనుకుంటుంది. ఆ కాలువ ఒడ్డుకు తనను తీసుకుని వెళ్లే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంది మన గానుగ చెట్టు.

 మొత్తానికి ఇంకో ఒక్కరోజులో లక్ష్మణ్ జీతం తీసుకోబోతున్నాడు. రేపు ఒక్కరోజు పని చేస్తే, ఈ నెల జీతం అందుతుంది. అప్పుడు అమ్మ ఇచ్చే వెయ్యి రూపాయలతో తన ఫ్రెండ్ షాపుకి వెళ్లి, ఏదైనా second hand ఫోన్ తీసుకుందాం అనుకున్నాడు. ఆ రాత్రంతా ఫోన్ గురించి ఆలోచిస్తూనే పడుకున్నాడు. నేను మీకు చెప్పడానికి ఆలోచిస్తున్నాను గానీ, లక్ష్మణ్ ఫోన్ అంత తొందరగా కావాలనుకోవడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. అది ఏమిటంటే " pub g, tik tok తన అన్నయ్య ఫోన్ లో అయినా ఆడవచ్చు. కానీ లక్ష్మణ్ intension అంతా 'ఆ వీడియోస్' చూడాలని.

ప్రతిసారిలాగే ఆ రోజు రాత్రి కూడా ఆ గ్రౌండ్ లోకి ఆ నలుగురు కుర్రాళ్ళు వచ్చారు. మందు తాగడం మొదలు పెట్టారు. 


వారిని చూస్తున్న గానుగ చెట్టు ఇలా అనుకుంటుంది " నాకంటే కదిలే అదృష్టం లేదు, ఈ మనుషులకు కదిలే శక్తి ఉన్నాసరే జీవితాంతం ఒకే చోట ఎలా ఉండగలుగుతున్నారు? వీళ్ళకి పెద్ద పెద్ద గమ్యాలేవీ ఉండవా? లేదా ఉన్న దానితోనే సరిపెట్టుకుంటున్నారా! లేదులే, వీళ్ళు ఉన్నదానితో సరిపెట్టుకుంటే మేమెందుకు అంతరించిపోతాంలే.....
 మనుషులు ఒక్కరే ఆలోచించడం వల్ల ఇదంతా జరుగుతుంది, కానీ ఏ ఒక్క మనిషీ ఆలోచించలేకపోతున్నాడు. 


వీళ్ళకున్న స్వేచ్ఛకు అర్థమే తెలియదు వీళ్ళకి! అయినా " స్వేచ్ఛ అంటే నచ్చినట్లు ఉండడమే కాదు, నచ్చినట్లు ఉండనివ్వడం కూడా! ". అయినా ఇప్పుడు వీళ్ళ గమ్యాలతో నాకు పనేంటీ... నా గమ్యం మాత్రం ఆ కాలువ ఒడ్డుకు వెళ్ళడమే " అని తనతో తాను మాట్లాడుకుంది

నేను మీకు చెప్పడానికి ఆలోచిస్తున్నాను గాని గానుగ చెట్టు ఆ కాలువ ఒడ్డుకు వెళ్ళాలి అనుకోవడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. అది ఏమిటంటే " తను ఇప్పుడు ఉంటున్న ఆ గ్రౌండ్ మొత్తం ఎండిపోయి బీటలు వారింది. తన వేర్లు భూమిలోకి ఉండడం వల్ల తనకి నీళ్లు అందుతున్నాయి. ప్రతిరోజూ తన నుండి ఎన్నో గానుగ పిక్కలు పడుతుంటాయి. నీళ్లు అందక పోవడం వల్ల, అక్కడే ఆడుకున్న పిల్లలు ఆ పిక్కలను తొక్కేయడం వల్ల, తను రాల్చిన ఆ పిక్కల నుండి మొక్కలు మొలవడం లేదు. అదే కాలువ ఒడ్డున అయితే, తన పిల్లలు ఎదుగుతారని ఆశ తనది! ". తన కోసం కాకపోయినా తన పిల్లల కోసమైనా ఆ గానుగ చెట్టు అక్కడ నుండి కదిలే తీరాలి........

 తెల్లవారింది. లక్ష్మణ్ జీతం అందుకున్నాడు. అందిన జీతంలో 1000 రూపాయలు లక్ష్మణ్ కి ఇచ్చింది వాళ్ళ అమ్మ. లక్ష్మణ్  ఆ 1000 రూపాయలు పట్టుకొని తన ఫ్రెండ్ సెల్ షాప్ కి వెళ్ళాడు. ఆ 1000 రూపాయలకి మంచి ఫోన్ రాదు అని వాళ్ళ ఫ్రెండ్ చెబుతూనే ఉన్నా ' ఏ ఫోన్ అయినా పర్వాలేదు ' నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి అని పట్టుపట్టాడు లక్ష్మణ్. 1000 రూపాయలకి వచ్చే ఫోన్ లో pub g ఆడలేవు, net సరిగ్గా అవ్వదు అని చెప్పాడు, ఏదో ఒకలాగ ఇంకో 500 రూపాయలు చూడు... అన్నీ వచ్చే ఫోన్ చూస్తాను అని అన్నాడు. లక్ష్మణ్ కొంచెంసేపు ఆలోచించి, ఒక 5 రోజులలో డబ్బులు తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంకో 5 రోజుల తర్వాత owner దగ్గరికి వెళ్లి, జీతంలో నుండి 500 అడగవచ్చు అనుకున్నాడు. 

5 రోజులు గడిచాయి. 

ఆరోజు సాయంత్రం అయింది. లక్ష్మణ్ ఇంకా చెట్టు కింద పడుకునే ఉన్నాడు. గట్టిగా గాలి వేయడం మొదలు పెట్టింది. ఆ గాలికి గానుగ చెట్టు కొమ్మలు అటూ ఇటూ ఊగుతున్నాయి. గ్రౌండ్ లో ఉన్న దుమ్ము ఎగురుతుంది. వెంటనే లక్ష్మణ్ నిద్రలేచాడు. పరిగెత్తుకొని వెళ్లి గేదెలు అన్నింటిని ఒక దగ్గరకు తీసుకు వస్తున్నాడు. గానుగ చెట్టుకు అవతలి ఒడ్డుకు వెళ్లడానికి ఇదే అవకాశం అనిపించింది. వేస్తున్న గాలికి అనుగుణంగా తాను కూడా గట్టిగా ఊగడం మొదలుపెట్టింది. తన కొమ్మలకు ఉన్న పిక్కలన్నీ రాలిపోయి దూరంగా ఎగిరిపోతున్నాయి. ఇంకొంచెం గట్టిగా ఊగితే, ఆ గానుగ చెట్టు అక్కడి నుండి కదిలినట్లే! అప్పటికే తన వేర్లను కూడా కదిలించింది. తన గమ్యాన్ని చేరుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. లక్ష్మణ్ గేదెలన్నింటినీ తోలుకొని గ్రౌండ్ నుండి బయలుదేరాడు.
అంతలా ఊగుతున్న చెట్టుకు ఒక ఆలోచన వచ్చింది. తనకన్నా ఎంతో తేలికగా ఉండే పిక్కలే గ్రౌండ్ దాటడం లేదు. ఇక ఆ గాలికి తను ఆ గ్రౌండ్ కూడా దాటలేదని తెలుసుకొని వేర్లతో మట్టిని గట్టిగా పట్టుకొని నిలిచింది. కొద్ది సేపటికి గాలి ఆగింది, చెట్టు నిలిచింది. 

లక్ష్మణ్ గేదెలను తోలుకొని owner ఇంటికి తీసుకెళ్ళాడు. ధైర్యం చేసి owner ని 1000 రూపాయలు అడిగి, జీతం నుంచి కట్ చేసుకోమన్నాడు. దానికి owner " నీకు జీతం ఇచ్చి 5 రోజులే అయ్యింది. అయినా జీతం గురించి నీకెందుకురా! నీ జీతం మీ అమ్మకి ఇస్తాను " అని చెప్పాడు. చేసేదేమీలేక లక్ష్మణ్ ఇంటికి వెళ్లిపోయాడు.

 గానుగ చెట్టూ, లక్ష్మణ్ ఇంకొక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.......

గట్టిగా గాలి వేసిన ఐదు రోజుల తర్వాత........

ఆరోజు లక్ష్మణ్ వాళ్ళ అన్నయ్య కంగారు కంగారుగా పనికి వెళ్ళిపోయాడు. ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాడు. లక్ష్మణ్ వాళ్ళ అమ్మని అడిగి తనతోపాటు పనికి ఫోన్ తీసుకెళ్లాడు. గేదెలను గ్రౌండ్ లో వదిలేసి, తను చెట్టు కిందికి వచ్చి ఫోన్ వాడుతున్నాడు. continuous‌ గా రెండు గంటలు ఫోన్ వాడేశాడు. 

ఐదు రోజుల క్రితం వేసిన గాలికి గానుగ చెట్టు తట్టుకుని నిలిచే ఉంది. కానీ ఇప్పుడు తనలో తను మాట్లాడుకోలేదు. వేర్లన్నీ పైకి వచ్చేయడంతో నీళ్లు అందక గానుగ చెట్టు ఎండిపోయింది. ఫోన్ లో ఛార్జింగ్ కొంచమే ఉండడంతో, ఆ వేర్లు బయటకు వచ్చేసిన గానుగ చెట్టు కింద కూర్చొని, ఎండ కారణంగా ముఖం దీనంగా పెట్టి సెల్ఫీ వేసుకున్నాడు. ఆ ఫోటోని whatsapp status గా పెట్టి, పడుకున్నాడు. 

ఆ ఫోటో ఎలా ఉందంటే....... " ఒక అబ్బాయి వేర్లు బయటకు వచ్చేసిన ఎండిపోయిన చెట్టు కింద కూర్చుని, నా జీవితం కూడా అలానే అయిపోయింది " అని చెప్పినట్లు ఉంది. 

ఆ status ని తన అన్నయ్య contacts లో ఉన్నవాళ్ళందరూ చూశారు. కొంతమంది ఆ ఫోటోని resend చేయమన్నారు. ఇంకొంతమంది screenshot తీసి status పెట్టుకున్నారు. అలా status పెట్టిన వాళ్లలో ఒక అబ్బాయి ఆ ఫోటోకి ఒక tag line add చేశాడు ఆ tag line ఏమిటంటే " we have to replant their lives " అని. ఆ అబ్బాయి status ని వాళ్ళ HOD sir చూసి లక్ష్మణ్ గురించి అడిగారు. దానికి ఆ అబ్బాయి " లక్ష్మణ్ తన ఫ్రెండ్ తమ్ముడనీ, చదువు మానేసి పాలేరుగా పని చేస్తున్నాడు " అని చెప్పాడు. 

ఆ ఫోటో నచ్చడం వల్ల, లక్ష్మణ్ కథ విన్న HOD sir, మరుసటిరోజున లక్ష్మణ్ ఇంటికి వచ్చారు. లక్ష్మణ్ వాళ్ళ అమ్మతో మాట్లాడి, లక్ష్మణ్ చదువుకు అయ్యే ఖర్చు తాను పెట్టుకుంటానని ఒప్పించారు. అంత పెద్దాయన వచ్చి, అన్నీ తానే చూసుకుంటానని అనడంతో లక్ష్మణ్ వాళ్ళ అమ్మ కాదనలేకపోయింది. దానికి తోడు లక్ష్మణ్ బాల కార్మికుడు కూడా!... దాంతో లక్ష్మణ్ కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. 

ఇక లక్ష్మణ్ ఇంటికి దూరంగా వెళుతుండటంతో, వాళ్ళమ్మ ఇంకో 500 రూపాయలు వేసి లక్ష్మణ్ అనుకున్న second hand smart phone కొనిచ్చి HOD sir తో పంపించింది.........

 ఆ గ్రౌండ్ కి బేరం కుదరడంతో స్థలాన్ని అమ్మేసారు. స్థలాన్ని కొనుక్కున్న వాళ్ళు ఆ గ్రౌండ్ మధ్యలో ఎండిపోయిన గానుగ చెట్టును పీకేసి, ఆ స్థలం చుట్టూ fencing వేశారు. 

గానుగ చెట్టు వేర్లూ, చిన్న చిన్న కొమ్మలూ తీసేసారు. మధ్యలో ఉన్న కాండం కాలువ దాటడానికి ఉపయోగపడుతుందని, ఆ కాండాన్ని తీసుకెళ్ళి గ్రౌండ్ అవతల ఉన్న కాలువ మీద అటూ ఇటూ నడిచేందుకు బాటలా వేశారు.

 గ్రౌండ్ లోకి ఎవరూ రాకుండా fencing వేయడంతో, నేల మొత్తం మళ్ళీ మెత్తగా మారింది. అప్పటికే గ్రౌండ్ లో అక్కడక్కడా ఉన్న గానుగ పిక్కలూ, లక్ష్మణ్ గేదెల మీద వాలే కాకులను కొట్టడానికి విసిరిన గానుగ పిక్కలూ వర్షం నీరు నిలవడంతో చిగురించడం మొదలు పెట్టాయి.............



- giribabu MR.




జిగీష _ The first/last hope జిగీష _ The first/last hope Reviewed by Giribabu dola on May 01, 2020 Rating: 5

2 comments:

  1. Good attempt but the fault is that I expected more plz improve your writing skills prathee character lo back story rasthunnapppudu oka impact undaali people should own that character and more over finishing perfect ga ravali Katha Loni climax rayatam kaadhu convincing ga raayaali like phone kosam laxman cheruvu kosam chettu padina desires vivaranga cheppinappudu Avi dhakkinappudu vaati thaaluku emotions Ni kuda cheppunte kadhaki correct Conclusion undedhemo Ani naa personal feeling any way gud attempt one last suggestion actually people called it as a writing technic nachithe follow avvu
    Oka Kadha raasaaka 2 days gap ichi adhe kadhani oka bayata vyakthila nuvve criticize cheskuntu chadhuvu definate ga Konni changes kanipisthaay Konni flaus thelusthay then you'd realize something that you didn't filled in that story
    But plz don't stop trying a new stories this is Tharun(jetly)��

    ReplyDelete
    Replies
    1. Anything from you is always accepted
      ... I will do that

      Delete

Powered by Blogger.