ఒకరోజు వినయ్ నందిని ని చూసాడు. మాటల్లో వర్ణించడానికి తను మామూలు అమ్మాయి కాదు. పాటలు పాడేంత talent మన వినయ్ కి లేదు. facebook లో కూడా దొరకని అమ్మాయికి ఈరోజుల్లో హాయ్ చెప్పడం కూడా కష్టమే. తన ఫోటో గుండెల మీద పెట్టుకొని నిద్రపోదామంటే, ' నందిని ' అనే పేరు తప్ప తన గురించి ఇంకేం తెలియదు.
ఆ పేరు పెట్టి ప్రపంచం అంతా వినబడేలా పిలిచినా పలకని అమ్మాయి తను...
ఇంకేం చేస్తాడు! మళ్లీ పాత కాలపు ప్రేమకు తలుపులు తెరుచుకున్నాయి. వినయ్ timetable మారింది.
"కళ్ళు తెరచి వుంచినంత సేపూ తన గురించి తెలుసుకోవాలనే తపన , కలలో ఏమో తనతో ఎలా వుండాలా" అని ఆలోచిస్తూ ఉంటే క్యాలెండర్ తో పనిలేకుండా పోయింది వినయ్ కి.
తను ప్రేమిస్తున్న విషయం ఒక్కొక్కరిగా తన ఫ్రెండ్స్ కి చెప్పేశాడు. వినయ్ చేయాల్సిందల్లా నందిని గురించి తెలుసుకోవడమే.
ఇప్పుడు వినయ్ ని నిద్రలో లేపి ప్రశ్నలు అడిగినా సరే , వినయ్ చెప్పగలిగేవి ఏమిటంటే " నందిని ఎక్కే బస్సు నెంబరు, ప్రతి గురువారం తను వెళ్లే సాయిబాబా గుడి అడ్రస్, శనివారం రోజు తను వేసుకుని వచ్చే civil dress కలర్ " మాత్రమే..
ఎలాగైతేనేం, నందిని daily routines తెలుసుకున్నాడు.
ఇక ఈ సంవత్సరం అంతా తను ఫాలో అయిన సంగతిని నందినితో చెబుదామని అనుకున్నాడు. అందుకోసం ఒక లెటర్ రాద్దాం అనుకున్నాడు.
ఆ లెటర్లో
" తనని yellow dress లో చూసినప్పుడు గుండె ఆగినట్లు అయిన సంగతి "
" తను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఊపిరి అందనట్టు అయిన సంగతి "
"తన ఆలోచనలలో పడి పిచ్చి పిచ్చి కలలు రావడం మానేసిన సంగతి "
" తనకి చెప్పకుండా తనతో వందేళ్ల జీవితాన్ని ఊహించుకున్న సంగతిని " చెబుదాం అనుకున్నాడు.
కానీ ఎంత ప్రయత్నించినా ఒక మంచి ప్రేమలేఖని రాయలేక పోయాడు. అప్పుడు తన ఫ్రెండ్ గిరిబాబు తో ఒక ప్రేమ లేఖ రాయించుకున్నాడు.
ఆ లేఖ ఇదే......
నన్ను మురిపించేది ఒకటే
నా ముందు కదిలే నీ రూపం
నాకు అర్ధం కానిది ఒకటే
నా కలలో కూడా నీ చలనం
నేను చేయాల్సింది ఒకటే
నీతో పయనించడం
నాకు కావాల్సింది ఒకటే
నీతో జీవించడం
నాకు ఎదురు రావాల్సింది ఒకటే
నా కోసం నా వైపు వచ్చే నీ పాదం
నేను తెలపాల్సిందే ఒకటే
నువ్వంటే నాకు ఇష్టం
నాకు అనిపించింది ఒకటే
నువ్వే నా ప్రాణం
నాకు కనిపించాల్సింది ఒకటే
ఎన్నటికీ ఒకటై సాగే ఇద్దరి పయనం
నాకు తెలిసింది ఒకటే
నిన్ను ప్రేమించడం
ఇక జరగాల్సింది ఒకటే
నువ్వూ నేను కలిసి ఉండడం
ఇన్ని అవ్వాల్సి వున్నా ప్రస్తుతానికి జరుగుతుంది ఒకటే
ఏమవుతుందోనన్న నా సందేహానికి ఏమవ్వాలో చెప్పే ఈ కావ్యం నీకోసం.....
123 - I AM YOU
నేను నందిని తెలివైనది అని అనను కానీ, వినయ్ ని పలకరించడమే ' అన్నయ్యా ' అని పలకరించింది.
అంతమాత్రాన వినయ్ ది ప్రేమ కాకుండా పోతుందా ?
నేను ఇప్పటికీ వినయ్ ప్రేమను సపోర్ట్ చేయడానికి కారణం " నందిని గురించి ఎవరు ఏమి చెప్పినా వినయ్ నమ్మలేదు " .
ఇప్పుడు తన విషయం ఏం చేస్తావు అని అడిగితే , వినయ్ చెప్పిన సమాధానం .....
"the proposal is just cancelled and
love continues".
గొప్పగా ప్రేమించగలం కానీ మనం ప్రేమించిన వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు అయివుండరు...................
- giribabu MR.
I AM YOU -123
Reviewed by Giribabu dola
on
August 21, 2019
Rating:
I think this is ur story.������
ReplyDelete