తను తినకూడని కూర అయినా సరే , నువ్వు తింటానని చక్కగా వండిపెట్టే అమ్మ నుండి నువ్వేం నేర్చుకోలేదా ?
తనకి వాడటం రాకపోయినా సరే , నీకు పెద్ద ఫోన్ కొనిచ్చిన నాన్నని చూస్తే నీకు ఏం తెలియట్లేదా ?
అవి ఎండలో వుండి కూడా నీకు నీడనిచ్చే చెట్లను చూసి అసలేం నేర్చుకోలేకపోతున్నావా !
తను కరిగిపోతూ కూడా కాంతినిచ్చే కొవ్వొత్తి నీకు కామెడీగా కనబడుతుందా ?
తను మలినం అయిపోతానని తెలిసి కూడా నీకు మళ్ళీ మళ్ళీ దాహాన్ని తీర్చే నీటిని నువ్వు లెక్క చేయట్లేదా !
తన దారిలో తను వెళ్తూ కూడా , ఊపిరిగా మారిన గాలి నీకు గుర్తుకురాలేదా ?
బాధ్యతలేని నీ బరువుని కూడా బాధ్యతగా మోస్తున్న భూమాత నీకు కనబడలేదా !
చంపేస్తారని తెలిసినా సరే , నువ్వు బతికుండాలని సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు నీకు చిన్నచూపు అయ్యారా ?
నువ్వు బానిసగా బ్రతకకూడదని వాళ్ల బ్రతుకునే త్యాగం చేసి పోరాడిన దేశ నాయకుల చరిత్ర చదవలేదా !
ఆకలి వేయగానే అన్నం తినగలుగుతున్నావని , అదంతా నీ కష్టమే అనుకుంటున్నావా ! అంటే నీకు రైతుల గురించి ఎవరు చెప్పలేదా ?
నువ్వు ప్రశాంతంగా నిద్ర పోవాలని , నిద్రపోకుండా పని చేస్తున్న పోలీసులు నీకు పరాయివాళ్ళు అయ్యారా !
నువ్వు ముక్కు మూసుకొని పడేసిన చెత్తని , నీ ముందే తీసుకెళ్తున్న మున్సిపాలిటీ వాళ్ళు ఎలా కనబడుతున్నారు ?
నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలని , అన్నివేళలా నీకు అందుబాటులో ఉండే వైద్యులు ఎవరనుకుంటున్నారవ్ ?
పోనీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను !
నీ కాళ్లకు రక్షణనిచ్చే చెప్పులు
నీ కళ్ళకు కాపలా కాసే కనురెప్పలు
నీ గౌరవాన్ని కాపాడే దుస్తులు
నీ భావాన్ని వ్యక్తపరిచే మాటలు
నీ ఒంటరితనాన్ని పోగొట్టే నీ స్నేహితులు
నీకు బోర్ కొట్టకూడదు అని రోజుకి రెండుసార్లు charge అయ్యే నీ సెల్ ఫోను
నువ్వు నీకు ఇష్టంలేని పని చేస్తున్నా సరే , నీ కోసం సర్దుకున్న నీ బ్రెయిన్
నీ ఆలోచనలను రాసే పెన్ను
వాటిని దాచే బుక్సు
నీకోసం వెనక్కి రాలేకపోతున్న నిన్న
నిన్ను మార్చాలని ఎదురుచూస్తున్న రేపు
నీకోసం ఆగలేకపోతున్న గడియారం
ఎలాగైనా నిన్ను తనతో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న క్యాలెండర్
వీళ్ళందరూ వాళ్ల అవసరం కోసం మాత్రమే పనిచేస్తున్నారు అనుకుంటున్నావా ?
లేదా సమాజం మొత్తం అవసరం చుట్టూ తిరుగుతుంది కదా అని సాయం గురించి తెలుసుకోలేదా ?
గుర్తుంచుకో !
పోనీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను !
నీ కాళ్లకు రక్షణనిచ్చే చెప్పులు
నీ కళ్ళకు కాపలా కాసే కనురెప్పలు
నీ గౌరవాన్ని కాపాడే దుస్తులు
నీ భావాన్ని వ్యక్తపరిచే మాటలు
నీ ఒంటరితనాన్ని పోగొట్టే నీ స్నేహితులు
నీకు బోర్ కొట్టకూడదు అని రోజుకి రెండుసార్లు charge అయ్యే నీ సెల్ ఫోను
నువ్వు నీకు ఇష్టంలేని పని చేస్తున్నా సరే , నీ కోసం సర్దుకున్న నీ బ్రెయిన్
నీ ఆలోచనలను రాసే పెన్ను
వాటిని దాచే బుక్సు
నీకోసం వెనక్కి రాలేకపోతున్న నిన్న
నిన్ను మార్చాలని ఎదురుచూస్తున్న రేపు
నీకోసం ఆగలేకపోతున్న గడియారం
ఎలాగైనా నిన్ను తనతో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న క్యాలెండర్
వీళ్ళందరూ వాళ్ల అవసరం కోసం మాత్రమే పనిచేస్తున్నారు అనుకుంటున్నావా ?
లేదా సమాజం మొత్తం అవసరం చుట్టూ తిరుగుతుంది కదా అని సాయం గురించి తెలుసుకోలేదా ?
గుర్తుంచుకో !
అవసరంలో సాయం వుండదు , నువ్వే చేయాలి !
- giribabu MR.
అన్నీ నీకు అవసరం ఉంటే మాత్రమే చేస్తావా ?
Reviewed by Giribabu dola
on
April 18, 2020
Rating:
No comments: