ధైర్యవంతులుగా బ్రతకవలసిన పిరికివాళ్ళ కథ

ధైర్యవంతులుగా బ్రతకవలసిన పిరికివాళ్ళ కథ , వారు మరెవరో కాదు , మన యువత !


1.

దేశాన్ని మార్చడానికి ప్రయత్నించాలి , కానీ పరదేశం వెళ్ళాలనుకుంటున్నారు

2.  ఇష్టంతో చదవాలి , కానీ ఇష్టాల కోసం చదువుతున్నారు

3.


సంస్కారం నేర్చుకోవడానికి చదవాలి , కానీ సంసారం ఈదడానికి చదువుతున్నారు

4.  అన్ని కళల్లో ముందుండాలి , కానీ కలలు కనడంలో మాత్రమే ముందుంటున్నారు

5.  అందరికీ ఒక్కడిలా  వుండాలనుకోవాలి , కానీ అందరిలో ఒకడిలా ఉంటే చాలనుకుంటున్నారు

6.  తప్పును దారి మళ్ళించవలసింది పోయి , తప్పు దారి పడుతున్నారు

7.  చెడును తరిమే సాహసాలు చేయాలి , కానీ చెడుతో సావాసాలు చేస్తున్నారు

8.  సంచలనం సృష్టించాలి , కానీ చలనం లేకుండా ఉంటున్నారు

9.  కాలంతో పరుగు పెట్టాల్సింది పోయి , కాలం వెనకాల పరుగు పెడుతున్నారు

10.



చావును చంపి బ్రతకాలి , కానీ బ్రతకలేక ఛస్తున్నారు

11.  చరిత్రను తిరగరాయాలి , కానీ చరిత్రను తిరగేస్తున్నారంతే

12.



నవ్వుతూ బ్రతకాలి , కానీ బ్రతకడం కోసం నవ్వుతున్నారంతే

ఏకంగా ఆకాశాన్నే అందుకోవలసిన వారు చిన్న అవకాశాన్ని కూడా అందుకోలేక పోతున్నారు

మీకు తెలుసా ! " దేశ ప్రగతికి ఉపయోగపడే the best formula YOUTH "



- giribabu MR.



ధైర్యవంతులుగా బ్రతకవలసిన పిరికివాళ్ళ కథ ధైర్యవంతులుగా బ్రతకవలసిన పిరికివాళ్ళ కథ Reviewed by Giribabu dola on October 21, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.