మనం carrom board ఆడుతున్నప్పుడు , ఆటలో చాలా situations మనకి ఎదురవుతాయి . ఆ situations ని జీవితంతో పోల్చితే ఇలా వుంటుంది...
మనందరం carrom board సరదా కోసం ఆడతాం. మనకి తెలియకుండానే ఆ ఆటలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో జీవిత సత్యాలు దాగి ఉన్నాయి. carrom board ఆడేటప్పుడు ఆటలో మనకి ఎదురయ్యే సందర్భాలు అన్నింటిని ఒక జీవితంతో పోలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చదవండి ....
1.
ఒక్కసారి striker నీ చేయి దాటితే అది మళ్ళీ ముగ్గురిని దాటి నీ దగ్గరకి రావాలని గుర్తుంచుకో.
అంటే సమయం / అధికారం వున్నప్పుడే నువ్వు చేయాల్సిన పనిని మొదలు పెట్టు , వాయిదా వేస్తే బోర్డు (coins) చెదిరిపోతుంది .
2. Red coin తప్ప మిగిలిన coin లు వేయను అని కూర్చుంటే నీ ఆట ప్రశ్నర్ధకంగానే ఉంటుంది , అదే వేరే coin లు కూడా వేస్తూ red coin కి try చేస్తే , వేరే ఆటకు ఆడే అవకాశం వస్తుంది .
అనుకున్నదే చేయాలనుకోవాలి సరే , కానీ అనుకున్నదొక్కటే చేయాలనుకుంటే మాత్రం కష్టమే . ఎందుకంటే బాధ్యత భవిష్యత్తు ఎప్పుడూ వదులుకోకూడదు
3.
తరువాతి ఆట ఆడటానికి నీ దగ్గర ఒక్క coin వున్నా చాలు, తరువాతి ఆట ఆడటానికి నువ్వు అర్హుడవే . అంటే next level కి వెళ్ళాలంటే కనీసం ముందు level లో ఓడిపోయి అయినా ఉండాలి . అసలు participate చేయకుండా ఉంటే కష్టం .
4.
ఎలాపడితే అలా ఆడినవాడు మొదట్లో leading లోనే ఉంటాడు , ఆ ఆరువాత eliminate అయిపోతాడు .
జీవితంలో ఎలాపడితే అలా వుంటే ఇక అంతే .
5.
దారి తప్పిన వాడి జీవితం మళ్ళీ మొదటికే వస్తుంది.
6. అవతలివాడు ఎంత బాగా ఆడేవాడైనా , ఆట మొత్తానికి నీకు ఒక్క chance అయినా వచ్చే తీరుతుంది. ఆ chance ను వినియోగించుకో .
7.
ఒక్కోసారి కన్నం దగ్గర వున్న coin కూడా కష్టంగా పడుతుంది , నీకు కొట్టడం రావాలి . అంతకుముందే నీకు target పెట్టుకోవడం రావాలి .
8. ఎటువంటి పోటీ లేకపోతే నువ్వు ఒక్కడివే కొట్టుకొని coins తీసుకోవాలి , అది చాలా కష్టం .
ఇప్పట్లో పోటీ automatic గా వుంటుంది.
9.
5 white coins వేసినోడు గొప్పవాడా ,5 black coins వేసినోడు గొప్పవాడా అంటే " ఇద్దరి కష్టం ఒక్కటే , కానీ దారులు( గమ్యం ) వేరు .
అందుకే కష్టమైనా నష్టమైనా నీ దారి నీదే.
10. నీకు వీలుగా ఉండేది ఒక్క కన్నమే , కానీ నీకు ఎదురుగా రెండు కన్నాలు కనబడతాయి , ఇంకా సరిగ్గా చూస్తే చుట్టూ నాలుగు కన్నాలు ఉంటాయి .
జీవితం కూడా అంతే ! ఒక వైపు కూడా దారి లేదని మనం అనుకుంటాం కానీ చాలా దారులుంటాయి .
11.
ఎట్టి పరిస్థితుల్లో కన్నంలోకి striker వెళ్లదని గుర్తుంచుకో !
12. ఆఖరిగా board జాగ్రత్త , board లేకపోతే మనం ఆట ఆడలేం .
అలాగే ఈ పర్యావరణం జాగ్రత్త , అది క్షేమంగా లేకపోతే మనం బ్రతకలేం .
-giribabu MR.
మనం carrom board ఆడుతున్నప్పుడు , ఆటలో చాలా situations మనకి ఎదురవుతాయి . ఆ situations ని జీవితంతో పోల్చితే ఇలా వుంటుంది...
Reviewed by Giribabu dola
on
October 15, 2019
Rating:
No comments: