ఈ బ్లాగ్ గురించి మీకు కొన్ని విషయాలు

అందరికీ నమస్కారం ! నా పేరు giribabu MR.  . నా గురించి , ఈ బ్లాగ్ గురించి మీకు కొన్ని విషయాలు చెబుతాను .

About author :

నేను ప్రస్తుతం M.Tech చదువుతున్నాను. నేను 8త్ క్లాస్ చదువుతున్న సమయంలో నాకు గొప్ప విషయాలను collect చేసి ఒక దగ్గర ఉంచాలని అనిపించింది. అప్పుడు సాక్షి ఫ్యామిలీ పేపర్, ఈనాడు హాయ్ బుజ్జి పేపర్ collect చేయడం మొదలుపెట్టాను. ఆ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి, వాటిలో important topics కట్ చేసి వాటిని ఒక బుక్ లో అంటిద్దాం ఆ పనిని మొదలుపెట్టాను.

అదే సమయంలో నేను విన్న GK బిట్స్, చదివిన మంచి మాటలు అన్ని ఒక చిన్న నోట్స్ లో వ్రాయడం మొదలు పెట్టాను. వాటితో పాటుగా సెలబ్రిటీల పుట్టినరోజులు, సాంగ్స్ యొక్క లిరిక్స్ కలెక్ట్ చేయడం లాంటివి చేశాను. ఆ process లో నాకు రాయడం అలవాటు అయింది.

 పదవ తరగతికి వచ్చాక స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ మర్చిపోతానేమో అని ఆ హోంవర్క్ రాయడం కోసం ఇంకో చిన్న నోట్స్ పెట్టాను. ఆ నోట్స్ లో కింద ప్రతి రోజు ఏదో ఒక మంచి మాట  నేను చదివింది రాసేవాడిని.

పాలిటెక్నిక్ లో చేరిన మొదటి సంవత్సరంలో ఇంకో నోట్ బుక్ పెట్టాను. అందులో నా సొంత మాటలు మాత్రమే రాద్దామని పెట్టాను. కానీ పెద్దగా అనుభవం లేకపోవడంతో ఆ బుక్ కంప్లీట్ చేయలేకపోయాను. డిప్లమా అయిపోయినా సరే ఆ చిన్న నోట్బుక్ మాత్రం కంప్లీట్ కాలేదు.

ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో జీవితం గురించి ఏదో తెలిసిందన్న ఆలోచన వచ్చిందో ఏమో ! వరుసగా మూడు పుస్తకాలు పూర్తి చేసేసాను. కాలేజీలో క్లాసులు వినడం కన్నా, క్లాసులో కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏమి రాద్దామా అని ఉండేది ప్రతిరోజు.

 ఆ సంవత్సరంలోనే మా nagendra sir సహాయంతో ఒక రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాను. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో android ఫోన్ కొన్నాను. నా ఫ్రెండ్ venkat నాకు ఈ బ్లాగ్ క్రియేట్ చేశాడు. కానీ నాకు అప్పటికీ ఫోన్ ఎలా వాడాలో తెలియక ఏమీ పట్టించుకోలేదు.

2019లో ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత మూడు నెలలు ఇంటిదగ్గర ఖాళీగా కూర్చొని blogging గురించి వీడియోస్ చూసి తెలుసుకుని అదే continue చేస్తున్నాను. 

About this blog :

ఇప్పుడు ఈ బ్లాగులో మీరు చిన్న చిన్న కథలు, కొన్ని quotes వెనుక దాగి ఉన్న సందర్భాలు, నేను discuss చేసిన విషయాలు, నేను తీసిన short films చూడవచ్చు మరియు చదవవచ్చు.

 ముఖ్యంగా ఈ బ్లాగ్ లో చేసిన ప్రతి పోస్ట్ నేను రాసింది మాత్రమే.

 నేను రాసింది నచ్చితే daily visit చేయండి మీరు నాకు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, 
మీకు ఎటువంటి సలహాలు కావాలన్న ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చెయ్యండి.....

ph : 6300693365

gmail : giribabuka777@gmail.com

ఈ బ్లాగ్ గురించి మీకు కొన్ని విషయాలు ఈ బ్లాగ్ గురించి మీకు కొన్ని విషయాలు Reviewed by Giribabu dola on September 17, 2018 Rating: 5

No comments:

Powered by Blogger.