ఆరోజు సుబ్రహ్మణ్య షష్టి ఉదయం ఏడు గంటలకు....
సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి బయట దర్శనం కోసం చాలా పెద్ద లైన్ ఉంది .
ఒక ఆవిడ మూడు సంవత్సరాల బాబును ఎత్తుకొని ఆ లైన్లో ఒక్కొక్కరి దగ్గరికీ వెళ్లి బాబు వైపు చూపిస్తూ డబ్బులు దానం చేయమని అడుగుతుంది .
చాలామంది దానం చేస్తున్నారు ఎందుకంటే ఆ బాబు
" రేపు నా ఫ్యూచర్ ఏమిటో "
అన్నట్టుగా అమాయకంగా చూస్తున్నాడు .
అదే రోజు ఉదయం 10 గంటలకు వేరేచోట.......
రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక అమ్మ నాన్న పెద్ద సంచి వేసుకొని ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుతున్నారు.
వాళ్ల వెనకాలే వాళ్ళ 12 సంవత్సరాల కూతురు కూడా చిన్న సంచి భుజాన వేసుకుని కాగితాలు ఏరుతుంది.
" రేపు నా ఫ్యూచర్ కూడా ఇంతేనా " అన్నట్టు వాళ్ళ వెనకాలే వెళ్తుంది .
అదే రోజు సాయంత్రం 5 గంటలకు వేరేచోట.....
నాన్న తిట్టాడని కోపంతో ఒక అబ్బాయి ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు.
" ఈ సారి ఎలాగైనా సాధించాలి " అన్న కసితో ఎప్పుడూ తను ఒంటరిగా ఆలోచించే ప్రదేశానికి బయలుదేరాడు.
ఇవి కొన్ని కథలు మాత్రమే ఇలాంటివి ఇంకెన్నో కథలున్నాయి ! కాబట్టి వాళ్ల తరఫున నేను మాట్లాడుతున్నా...
ఇప్పట్లో youth కి wait చేసే ఓపికా , weight s ఎత్తే ఓపికా అస్సలు లేదు .
' ఈ దేశం నాకేమిచ్చింది ' అన్న ప్రశ్న వీళ్ళకు వచ్చిందంటే ' ఈ దేశం నుండి నేనేం తీసుకోవాలి ' అన్న ఆలోచన వీళ్లకు మొదలవుతుంది.
పొరపాటున వీళ్ళు ' ఎలాగైనా ' సాధించాలి అని అనుకున్నారా ' ఏదైనా ' సాధిస్తారు .
వీళ్లని అలా వదిలేస్తే వీళ్లలో నుంచి ఇంకో అబ్దుల్ కలాం పుడతాడేమో ! మరి మిగతా వాళ్ళ పరిస్థితి ?
వీళ్లు చచ్చేదాకా వెళ్తారు చంపేసే వస్తారు , చావుని !
అందుకే వీరికి ఒక అవకాశం ఇచ్చి చూడండి , చించేస్తారు !
- giribabu MR.
ఒక్క అవకాశం యిచ్చి చూడండి !
Reviewed by Giribabu dola
on
November 02, 2019
Rating:
No comments: