ఈ రోజుల్లో బస్సులో పక్క సీట్ లో వేసిన కర్చీఫ్ కి ఇచ్చినంత విలువ నీ అభిప్రాయాలకు ఇవ్వరు




ఈ రోజుల్లో బస్సులో పక్క సీట్ లో వేసిన కర్చీఫ్ కి ఇచ్చినంత విలువ నీ అభిప్రాయాలకు ఇవ్వరు


(Story behind the quote)

గిరి లేవడం లేవడం తోనే కోపంగా లేచాడు. ఎనిమిది అయినా మ్రోగని తన అలారం మీద కోపం వచ్చింది కానీ క్యాలెండర్ చూస్తే ఆదివారం. అప్పుడు గుర్తొచ్చింది, ఆదివారం అని తానే అలారం పెట్టలేదు . కళ్ళు మూసుకొని తనకి ఏం కల వచ్చిందో అని రెండు నిమిషాలు ఆలోచించాడు. గుర్తుకు రాకపోవడంతో తన మీద తనకే కోపం వచ్చింది. బ్రష్ చేయడానికి బయటకి వచ్చాడు. ఈ సారి అమ్మ మీద కోపం వచ్చింది. నీళ్ళు పట్టడం అయిపోయిన తరువాత కూడా కొళాయి కట్టకుండా వదిలేయడం వల్ల. కొళాయి కట్టి లోపలి వచ్చాడు. చికెన్ తీసుకురమ్మని అమ్మ డబ్బులు ఇచ్చింది. బయటకి వచ్చి తన సైకిల్ ఎక్కుతుండగా ఇంకా వెలుగుతున్న Street light ని చూసి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు తప్ప ఆ light ఆరిపోయి ఉండడం తను ఎప్పుడూ చూడలేదు .  దాని గురించి ఆలోచిస్తూ కాలనీ దాటి మెయిన్ రోడ్ మీదకి రాగానే sudden గా సైకిల్ బ్రేక్ వేసాడు. Over speed లో వెళుతున్న bike వాడిపై  పట్టలేనంత కోపం వచ్చింది.కానీ ఏం చేస్తాడు,గిరి కోప్పడేలోపే వాడు వెళ్లిపోయాడు.సరే అనుకుని సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాడు.గతుకుల రోడ్డు రానే వచ్చింది. కోపంతోనే ఆ గతుకుల్లో సైకిల్ తొక్కుతున్నాడు. Online లో complaint ఇచ్చాడు కానీ వాళ్ళు ఆ గతుకుల్లో మట్టి  మాత్రమే వేసారు. చికెన్ షాపుకి వెళ్ళి token రాయించుకున్నాడు. చాలామంది ఉండటం వల్ల కూర్చీలో కూర్చుని అందరినీ చూస్తున్నాడు. మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకంటే " ప్లాస్టిక్ కవర్లు నిషేధం" అనే బోర్డును ఒక కవర్లో పెట్టి మూల పెట్టారు. చికెన్ తీసుకుని bus stop కి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం,తను రోజూ చూసే అమ్మాయి రాదని తెలిసినా సరే, మనసు వెళ్ళమని చెప్పింది. bus stop కి ఎదురుగా సైకిల్ ఆపాడు. గిరి కి ఆశ్చర్యం కలిగింది, ఎందుకంటే bus stop పక్కనున్న మద్యం షాపు మూసి వుండటం తను ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చూడలేదు.ఇంతలోనే కోపం వచ్చింది, 17 ఏళ్ల కుర్రాడు ఒక ముసలాయనతో బీర్ కొనిపించి  పట్టుకెళ్తున్నాడు.అదే షాపు దగ్గర సిగరెట్  కాల్చుతున్న అంకుల్ ని చూసి చంపేద్దామన్న కోపం వచ్చింది . ఎందుకంటే ఆ పొగ  bus stop లో చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఆవిడ వైపు వెళ్తుంది. కోపంతో సైకిల్ స్టాండ్ వేసి తిడదామని రోడ్ దాటుతున్నాడు, ఇంతలోనే బస్సు వచ్చింది. సిగరెట్ కాల్చిన అతను, పాపను ఎత్తుకున్న ఆవిడా బస్సు ఎక్కేసారు. గిరి కి కోపం ఇంకా పెరిగింది కాకపోతే ఆ కోపం "బస్సు డోర్ దగ్గర నించుని ఫోన్ వాడుతున్న అబ్బాయి మీద, పది సంవత్సరాలు కూడా నిండని పిల్లవాడికి పది రూపాయలు దానం చేస్తున్న పెద్దావిడ మీద, earphones పెట్టుకొని scooty నడుపుతున్న  14 ఏళ్ల అమ్మాయి మీద, ఎటువంటి జాగ్రత్త తీసుకోకుండా కాలువ శుభ్రం చేయడానికి manhole లోకి దిగుతున్న వర్కర్ మీద, స్నేహితుడి  పుట్టినరోజు కోసం  పెద్ద banner కడుతున్న కుర్రాళ్ల మీద, కరెంటు లైన్స్ కోసం చెట్లను కొట్టేసిన కార్పొరేషన్ వాళ్ళ మీద, గట్టిగా horn కొడుతున్న బైక్ వాడిమీద"  ఒక్కసారిగా horn sound కి కళ్ళూ చెవులూ మూసుకున్నాడు. అప్పుడు తాను రాత్రి కన్న కల గుర్తుకువచ్చింది. అది " 2030 లో గిరి ప్రధానమంత్రిగా వున్నప్పుడు పార్లమెంట్ లో రిజర్వేషన్స్ తొలగిస్తున్నట్టు
ప్రకటిస్తాడు. కానీ ఒక్కరు కూడా ఆమోదం తెలపరు. అప్పుడు కోపంతో  పార్లమెంట్ నుండి బయటకి వచ్చేస్తాడు ( కలలో నుంచి కూడా ). కళ్ళు తెరచి సైకిల్ దగ్గరకి వెళ్లి ఫోన్ తీసుకొని watsapp లో స్టేటస్ ఇలా పెడతాడు...

ఈ రోజుల్లో బస్సులో పక్క సీట్ లో వేసిన కర్చీఫ్ కి ఇచ్చినంత విలువ నీ అభిప్రాయాలకు ఇవ్వరు


          
  -giribabu MR.


ఈ రోజుల్లో బస్సులో పక్క సీట్ లో వేసిన కర్చీఫ్ కి ఇచ్చినంత విలువ నీ అభిప్రాయాలకు ఇవ్వరు ఈ రోజుల్లో బస్సులో పక్క సీట్ లో వేసిన కర్చీఫ్ కి ఇచ్చినంత విలువ నీ అభిప్రాయాలకు ఇవ్వరు Reviewed by Giribabu dola on October 08, 2019 Rating: 5

1 comment:

Powered by Blogger.